ఒక్క రూమ్‌లోనే 114 సూట్‌కేస్ కంపెనీలు: సత్యం రాజు కుటుంబసభ్యులవే

First Published Jul 26, 2018, 1:36 PM IST
Highlights

హైద్రాబాద్‌లో రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ కు చెందిన అధికారులు నిర్వహించిన  తనిఖీలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఒకే రూమ్‌లో 25 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యాలయంలో 114 సూట్‌కేసు కంపెనీలు కొనసాగుతున్నాయి


హైదరాబాద్: హైద్రాబాద్‌లో రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ కు చెందిన అధికారులు నిర్వహించిన  తనిఖీలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఒకే రూమ్‌లో 25 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యాలయంలో 114 సూట్‌కేసు కంపెనీలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలన్నీ కూడ సత్యం రామలింగరాజుకు చెందినవిగా అధికారులు గుర్తించారు.

జూబ్లీహిల్స్‌లోని  మానార్చ్ మాల్‌లో ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయంలో ఎస్ఆర్ఎస్ఆర్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్  ఈ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది.  హైద్రాబాద్‌లోని ఆరు ప్రాంతాల్లో  ఏక కాలంలో దాడులు నిర్వహించారు.

అయితే  ఈ సూట్‌కేసు కంపెనీల్లో ఎక్కువగా రాజుతో పాటు ఆయన బంధువులకు సంబంధించినవే ఉన్నాయని రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీ అధికారులు గుర్తించారు.
కేంద్ర  కార్పోరేట్ వ్యవహరాల మంత్రిత్వశాఖ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులను నిర్వహించినట్టు ఆయన చెప్పారు. ఏపీ, తెలంగాణ నుండే  పెద్ద ఎత్తున ఈ రకమైన కంపెనీలు ఉన్నాయని సమాచారం వచ్చిందన్నారు.ఈ మేరకు తనిఖీలు నిర్వహిస్తే ఈ విషయం వెలుగు చూసిందన్నారు. 

అయితే ఒక వ్యక్తి 20 కంపెనీల్లో సభ్యుడిగా ఉండే అవకాశం ఉందని రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన ఓ అధికారి చెప్పారు. అయితే  ఈ నిబంధనలను ఉల్లంఘించారా లేదా అనే విషయమై విచారణ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

2009 తర్వాత సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత  సీబీఐ, ఈడీలు  సత్యం కంపెనీలు ఈ కంపెనీలపై  చార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
 సీబీఐ, ఈడీ లు తమ సంస్థలపై చార్జీషీట్లు దాఖలు చేసినట్టుగా ఎస్ఆర్ఎస్ఆర్ కంపెనీ అడ్వైజరీ సర్వీసెస్ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఈ సంస్థల్లో చాలా సంస్థలు జీరో బ్యాలెన్స్‌తో ఉన్నాయని ఆయన చెప్పారు. 


 

click me!