కాక మీదున్న తెలంగాణ కాంగ్రెస్

Published : Oct 24, 2017, 07:42 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
కాక మీదున్న తెలంగాణ కాంగ్రెస్

సారాంశం

అసెంబ్లీ వ్యూహాన్ని ఖరారు చేసిన తెలంగాణ కాంగ్రెస్ రైతాంగ సమస్యలపై గట్టిగా ఫైట్ చేయాలని నిర్ణయం తెలంగాణ జనాలకు మందు తాగించడం తప్ప చేసిందేం లేదని విమర్శ  

జనాలకు మందు తాపించి తాగుబోతులను చేయడం తప్ప తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ప్రగతి ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కేసీఆర్ పరిపాలన లో వ్యవసాయం సంక్షోభం లో పడిందని రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.

అసెంబ్లీలో సిఎల్పీ సమావేశంలో సర్కారు తీరును ఎండగట్టాని నిర్ణయించారు. అసెంబ్లీలో సిఎల్పీ సమావేశం సుదీర్ఘంగా సాగింది. పార్టీ ఎమ్మెల్యేలు పలు అంశాలపై సర్కారునపై ఎలాంటి వ్యూహంతో ఫైట్ చేయాలన్నదానిపై కసరత్తు జరిపారు. సమావేశం అనంతరం పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

బంగారు తెలంగాణ లో  రైతుల ఆత్మహత్య లు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. రుణమాఫీ అక్కరకు రాకుండా పోయిందన్నారు. ఏ పంట కు కూడా సరైన మద్దతు ధర లేదు, కొనుగోలు లేదని విమర్శించారు.

శాసన సభ లో కేసిఆర్ సర్కారు ఇచ్చిన ఏ ఒక్క మాట ను నిలబెట్టుకోలేదని విమర్శించారు. పబ్లిసిటీ తప్ప క్షేత్ర స్థాయిలో పథకాల అమలు జరగడం లేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు ను కూడా పాలకులు పరామర్శించలేదన్నారు.

అసెంబ్లీ, మండలి లో ఇచ్చిన మాట కే ఈ ప్రభుత్వం లో విలువ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రైతు సమస్యల పై  ఈ నెల 27 న ఛలో అసెంబ్లీ కి కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/Xh3cbG

PREV
click me!

Recommended Stories

Revanth Reddy Medaram Visit:మేడారంలో రేవంత్ రెడ్డి గిరిజనదేవతలకు ప్రత్యేకపూజలు | Asianet News Telugu
సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో CM Revanth Reddy Power Full Speech | CPI Celebrations | Asianet News Telugu