రామ మందిరపు మహా సంప్రోక్షణ కోసం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు వసతి కల్పించడానికి టెంట్ సిటీలు నిర్మిస్తున్నారు.
రామమందిర ప్రారంభోత్సవం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. రామమందిరంపై ఆమె స్పందించడం ఆసక్తికరంగా మారింది. అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఇది కోట్లాది మంది హిందువుల కల సాకారమయ్యే శుభఘడియ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఎక్స్ లో ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం చేసే పనులను ఎప్పుడూ విమర్శించే కవిత.. ఒక్కసారిగా రామ మందిరం మీద పాజిటివ్ ట్వీట్ చేయడంతో ఇదిప్పుడు ఆసక్తి కరంగా మారింది.
తెలుగులో చేసిన ఈ పోస్ట్ లో ఆమె రామాలయం ప్రారంభోత్సవంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "కోట్లాది మంది హిందువుల కల సాకారమయ్యింది. అయోధ్యలో శ్రీ సీతారామ చంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన శుభ ముహూర్తం వచ్చేసింది. దీనిని తెలంగాణతో పాటు దేశమంతా స్వాగతిస్తుంది" అని కవిత పోస్ట్ చేశారు.
ఈ పోస్టుతో పాటు కవిత నిర్మాణంలో ఉన్న రామమందిరం వీడియోను కూడా షేర్ చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ మధ్యాహ్నం నుండి 12:45 గంటల మధ్య రామాలయం గర్భగుడిలో రామ్ లల్లాను ప్రతిష్ఠించాలని నిర్ణయించింది.
ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను ట్రస్ట్ ఆహ్వానించింది. వచ్చే ఏడాది అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ్-ప్రతిష్ఠ (పవిత్ర) వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు ఒక వారం ముందు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి.
రామ మందిరపు మహా సంప్రోక్షణ కోసం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు వసతి కల్పించడానికి టెంట్ సిటీలు నిర్మిస్తున్నారు. స్థానిక అధికారులు 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు హాజరయ్యే భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్నిరకాల, వసతి, భద్రతా చర్యలతో సన్నద్ధమవుతున్నారు. వచ్చిన వారందరికీ ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన అనుభవాన్ని అందించడానికి మెరుగైన భద్రతా చర్యలను అమలు చేయడానికి, రవాణా ఏర్పాట్లు చేసే ప్రక్రియలో ఉన్నారు.
శుభ పరిణామం..
అయోధ్యలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రతిష్ట,
కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో...
తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు..
జై సీతారామ్ pic.twitter.com/qzH7M32cQJ