తండ్రిని మించిన తనయుడు.. కొడుకుపై కేటీఆర్ ట్వీట్

Published : Apr 13, 2019, 01:18 PM IST
తండ్రిని మించిన తనయుడు.. కొడుకుపై కేటీఆర్ ట్వీట్

సారాంశం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎంత పార్టీ పనుల్లో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎంత పార్టీ పనుల్లో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించినవి.. ఇతరత్రా ఇంట్రస్టింగ్ పోస్టులను కూడా పెడుతుంటారు. తాజాగా.. ఆయన పెట్టిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆయన పెట్టిన పోస్టు మరెవరిదో కాదు. స్వయానా ఆయన కుమారుడిదే. తన కొడుకు హిమాన్షుతో దిగిన ఫోటో పోస్టు చేసి...‘‘13 ఏళ్లకే మీ కుమారుడు ఎత్తులో మిమ్మల్ని మించిపోతే..  గట్టిగా ఓ హగ్‌ను కాకుండా ఇంకా ఏం కోరుకుంటారు’’ అంటూ ట్వీట్ చేశారు.  ఆ ఫోటోలో కేటీఆర్ కన్నా హిమాన్షు ఎత్తు ఎక్కువగా ఉండటం విశేషం.

కేటీఆర్ ట్వీట్ ని నెటిజన్ల నుంచి కూడా అంతే స్పందన వస్తోంది. తమ్ముడిని పట్టుకొని కొడుకు అంటారేంటి అని ఒకరు కామెంట్ చేయగా... హిమాన్షునే కేటీఆర్ కి తండ్రిలా ఉన్నాడంటూ ట్వీట్ చేశారు. ఇటీవల కేటీఆర్ తన కుమార్తె స్కూల్ ఫోటోలను కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.