ప్రైవేట్ హాస్పిటల్స్ ని తలదన్నుతూ... తెలంగాణ సర్కార్ దవాఖానల సరికొత్త రికార్డ్

Published : Aug 10, 2023, 02:30 PM IST
ప్రైవేట్ హాస్పిటల్స్ ని తలదన్నుతూ... తెలంగాణ సర్కార్ దవాఖానల సరికొత్త రికార్డ్

సారాంశం

ప్రైవేట్ హాస్పిటల్స్ ని తలదన్నుతూ తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్స్ లో రికార్డ్ స్థాయిలో ప్రసవాలు నమోదయ్యాయి. 

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. గత నెల జూలైలో అయితే ప్రభుత్వ ఆసుపత్రులు రికార్డు స్థాయిలో ప్రసవాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 72 శాతం ప్రభుత్వ హాస్పిటల్స్ లో జరిగినవేనని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ వైద్యారోగ్య సిబ్బందిని మంత్రి హరీష్ రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ హాస్పిటల్స్ లో 30శాతం ప్రసవాలు మాత్రమే జరిగితే ప్రస్తుతం అది 72 శాతానికి చేరింది. ఇది సీఎం కేసీఆర్ సుపరిపాలనలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు పెరిగిన నమ్మకానికి నిదర్శనం అని మంత్రి హరీష్ పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చడానికి కేసీఆర్ సర్కార్ చర్యలు తీసుకుంది. వైద్యారోగ్య శాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ప్రభుత్వం కొత్త హాస్పిటల్స్ ఏర్పాటుతో పాటు ఇప్పటికే వున్నవాటిలో సదుపాయాలను పెంచింది. దీంతో పేద ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్స్ పై నమ్మకం పెరిగిందని మంత్రులు, బిఆర్ఎస్ నాయకులు చెబుతుంటారు. 

 Read More 'గృహ‌ల‌క్ష్మి' ద‌ర‌ఖాస్తు గడువు పెంపు.. వాళ్లు ఈ ప‌థ‌కానికి అన‌ర్హులు.. !

ఇక హరీష్ రావు వైద్యారోగ్య శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ లో పరిస్థితి మరింత మారింది. ముఖ్యంగా ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు అవసరం లేకున్నా సిజేరియన్ చేయడం ఆగిపోయింది. సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని... అవసరం అయితేనే సిజేరియన్ చేయాలని డాక్టర్లు, వైద్య సిబ్బందికి పలు సందర్భాల్లో మంత్రి హరీష్ ఆదేశించారు. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువయ్యాయి.

ఇదిలావుంటే గర్భిణులకు కేసీఆర్ న్యూట్రీషన్ కిట్, ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్, ఆర్థిక సాయం వంటివి ప్రభుత్వం చేస్తోంది. ఇవికూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రసవాలు పెరగడానికి ముఖ్య కారణం. ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లి వేలకు వేలు కట్టి సిజేరియన్ చేయించుకోవడం కంటే ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఖర్చు లేకుండా సాధారణ ప్రసవం చేయించుకోవాలని గర్భిణులు భావిస్తున్నారు. వైద్య సదుపాలు మెరుగుపడటంతో గర్భిణుల కుటుంబసభ్యులు కూడా ప్రభుత్వాస్పత్రుల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో రోజురోజుకు ప్రభుత్వ హాస్పటల్స్ లో ప్రసవాల సంఖ్య పెరిగి గత నెల రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!