గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన : కేసీఆర్ తొమ్మిదేళ్లుగా నీరోలా వ్యవహరిస్తున్నాడు.. రేవంతరెడ్డి ఫైర్

By SumaBala Bukka  |  First Published Aug 10, 2023, 2:15 PM IST

తొమ్మిదేళ్లుగా నీరోలా వ్యవహరిస్తున్నాడంటూ కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. 


హైదరాబాద్ : నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా తొమ్మిదేళ్లు నీరోను తలపించిన కేసీఆర్ అంటూ టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్ధులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని ‘పరీక్ష’పెడుతున్నాడంటూ మండిపడ్డాడు. 

గ్రూప్ -2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తోన్న డిమాండ్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్వీట్టర్ వేదికగా మాట్లాడారు. 
ఇదిలా ఉండగా, గురువారం నాడు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు  టీఎస్‌పీఎస్‌సీని ముట్టడించారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా వేయాలి, దీనిమీద స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో  టీఎస్‌పీఎస్‌సీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

Latest Videos

మరోవైపు గ్రూప్-2  పరీక్షలను వాయిదా వేయాలని గురువారంనాడు 150 మంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  బ్యాంకు ఉద్యోగాలకు పరీక్షలు, గురుకుల పరీక్ష, జూనియర్ లెక్చరర్ పరీక్షలు, ఇతర  పోటీ పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ఆ పిటిషన్ లో కోరారు. 

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-2  పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో  నిర్వహించాలని నిర్ణయించింది. ఆగస్టులోనే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో.. ఏ పరీక్షకు ప్రిపేర్ కావాలో తెలియని అయోమయంలో నిరుద్యోగులు పడిపోయారు. దీంతో సందిగ్ధత నెలకొందని అభ్యర్థులు చెబుతున్నారు. 

గ్రూప్-2 పరీక్షల తేదీలు వెలువడగానే వారం రోజుల క్రితం  టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ ను గ్రూప్-2 అభ్యర్థులు కలిశారు. పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు. ఈ విషయమై టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గురువారం ఉదయం నుండి  అభ్యర్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు.  


 

నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా తొమ్మిదేళ్లు నీరోను తలపించిన కేసీఆర్…

ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్ధులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని ‘పరీక్ష’పెడుతున్నాడు.

గ్రూప్ -2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తోన్న డిమాండ్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని… pic.twitter.com/sLhZEYfB8o

— Revanth Reddy (@revanth_anumula)
click me!