
హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలోని చార్మినార్ జోన్ లో ఓ మహిళా కంప్యూటర్ ఆపరేటర్ ను ఉన్నతాధికారి వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో సదరు మహిళ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి (gadwal vijayalakshmi)కి ఫిర్యాదు చేయగా వెంటనే సదరు అధికారిణి సస్పెండ్ చేయాలని ఆమె ఆదేశించారు. ఇలా సాటి మహిళ బాధను అర్థం చేసుకుని అండగా నిలవడమే కాదు వెంటనే చర్యలకు ఆదేశించారు మేయర్ విజయలక్ష్మి.
వివరాల్లోకి వెళితే... వైద్యారోగ్య శాఖకు చెందిన శ్రీనివాస్ పదోన్నతిపై జిహెచ్ఎంసి (GHMC) కి వచ్చాయి. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లకు గాను 15సర్కిళ్లకు ఈయనే స్టాటిస్టికల్ ఆఫీసర్. ఈ క్రమంలోనే తన పరిధిలోని చార్మినార్ జోనల్ (charminar zone) కార్యాలయానికి వెళుతుండే అతడు అక్కడ పనిచేసే మహిళా కంప్యూటర్ ఆపరేటర్ పై కన్నేసాడు. ఆమెను లైంగికంగా వేధించసాగాడు.
కొంతకాలం అతడి వేధింపులను భరించినా మరీ శృతిమించడంతో సదరు మహిళ తట్టుకోలేకపోయింది. దీంతో ఉద్యోగ యూనియన్ నాయకులకు తనపై జరుగుతున్న లైంగిక వేధింపుల (sexual harassment) గురించి తెలిపింది. దీంతో వారంతా బాధిత మహిళకు అండగా నిలిచి శ్రీనివాస్ ఆగడాలపై చీఫ్ మెడికల్ అధికారికి ఫిర్యాదు చేసారు. ఇలా ఫిర్యాదు చేసి చాలారోజులు గడుస్తున్నా మెడికల్ ఆఫీసర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
read more ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసు... నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
ఇలాగయితే లాభం లేదని భావించిన బాధిత మహిళ నేరుగా జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిని కలిసి తన ఆవేదనను తెలిపారు. అధికారి వేధింపులతో తీవ్ర మనోవేధన అనుభవిస్తున్నానని... తోటి మహిళగా బాధను అర్థం చేసుకోవాలని కోరింది. ఈ వ్యవహారంపై మేయర్ (hyderabad mayor) కూడా సీరియస్ అయ్యారు. వెంటనే శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయడమే కాదు మాతృశాఖకు పంపించాలంటూ సంబంధిత ఆరోగ్యవిభాగం అడిషనల్ కమిషనర్ బాదావత్ సంతోష్‌ను మేయర్ ఆదేశించారు.
ఇక బాధిత మహిళ ఫిర్యాదు చేసినా పట్టించుకోని మెడికల్ ఆఫీసర్ పై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడితే ఉపేక్షించబోమని... ఇలాగే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు.
read more దారుణం.. క్వారంటైన్ లో తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం, వీడియో తీసి బ్లాక్ మెయిల్....!!
ఇదిలావుంటే ఆర్థిక కష్టాలున్నా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న వివాహిత సొంత బావ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న దారుణం కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి వివరిస్తూ సెల్పీ వీడియో తీసుకుని వివాహిత బలవన్మరణానికి పాల్పడింది.
కరీంనగర్ పట్టణం కాపువాడలో భర్త, పిల్లలతో కలిసి అరుణ అనే మహిళ నివాసముండేది. ఆర్థికంగా బలంగా లేకపోవడంతో కుటుంబానికి ఆసరాగా వుంటుందని బట్టలు కుడుతుండేది. ఇలా ఎంతో ఆత్మగౌరవంతో బ్రతుకున్న ఆమెపై సొంత బావ కనకయ్య కన్నేసాడు. కరోనా సమయంలో ఈ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం చేసి అదే అదునుగా అరుణపై లైంగిక వేధింపులకు దిగాడు. అతడి వేధింపులను తట్టుకోలేక చివరకు ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు ముందు తనపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి వివరిస్తూ వీడియో తీసుకుంది. అలాగే ఓ సూసైడ్ లెటర్ కూడా రాసి ఉరేసుకుంది. తన బావ కనకయ్య వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సదరు మహిళ బయటపెట్టింది.