నిజామాబాద్‌లో కేటీఆర్ పర్యటన.. కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Jan 28, 2023, 4:17 PM IST
Highlights

నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటనను బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాషాయ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ పర్యటనను అడ్డుకున్నారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. 

అంతకుముందు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌ పర్యటనలో ఉన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అన్నారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన సిద్దంగా ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్  నుంచే తిరుగులేని సమాధానం ఇవ్వాలని.. అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో బీఆర్ఎస్ గెలువాలని అన్నారు. రాబోయే ఏడు నుంచి తొమ్మది నెలల పాటు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్విరామంగా పని చేయాలని టీఆర్ఎస్ శ్రేణులను కోరారు. బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాట్లాడతారని.. వాళ్లకు దమ్ముంటే పార్లమెంట్‌ రద్దు చేసి రావాలని సవాలు విసిరారు. అలా చేస్తే ముందస్తుకు అందరం కలిసి పోదాం అంటూ కామెంట్ చేశారు.

ALso REad: దమ్ముంటే ఆ పని చేయండి.. ముందస్తు ఎన్నికలపై బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాలు..!

తెలంగాణలో అర్థవంతమైన పాలన జరుగుతోందని కేటీఆర్ అన్నారు. అభివృద్ది విషయంలో రాజీపడేది లేదని చెప్పారు. దేశంలో మత విద్వేషాలు  పెంచడం తప్ప.. బీజేపీ చేసిందేమి లేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తులను పరిశీలించాలని కోరారు. రైతుబంధు తరహాలో రూ. 5 వేలు దేశం మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు విద్యా సంస్థలు, రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టు హోదాఇవ్వాలని డిమాండ్ చేశారు. 

click me!