డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన బీజేవైఎం.. తీవ్ర ఉద్రిక్తత..

Published : Jan 28, 2023, 02:35 PM IST
డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన బీజేవైఎం.. తీవ్ర ఉద్రిక్తత..

సారాంశం

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా బీజేవైఎం నేతలు డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా బీజేవైఎం నేతలు డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలోనే వారు డీజీపీ కార్యాలయం ఆవరణలోకి దూసుకెళ్లారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. ఈ క్రమంలలోనే పోలీసులకు బీజేవైఎం నేతలు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ, వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు బీజేవైఎం నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇక, హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ మార్కులు కలిపి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?