ఎలా చనిపోయిందో కారణం చెప్పాల్సిందే : ప్రీతి తల్లిదండ్రుల పట్టు, నోరు జారిన వైద్యులు .. నిమ్స్‌లో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Feb 26, 2023, 10:22 PM ISTUpdated : Feb 26, 2023, 10:25 PM IST
ఎలా చనిపోయిందో కారణం చెప్పాల్సిందే : ప్రీతి తల్లిదండ్రుల పట్టు, నోరు జారిన వైద్యులు .. నిమ్స్‌లో ఉద్రిక్తత

సారాంశం

హైదరాబాద్ నిమ్స్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ బిడ్డ మరణానికి కారణం చెప్పాల్సిందేనంటూ ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. దీంతో వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోరు జారారు. 

ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ మెడికల్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి చికిత్స పొందుతూ హైదరాబాద్ నిమ్స్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నిమ్స్ ఐసీయూలో ప్రీతి బంధువులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆమె ఎలా చనిపోయిందన్న దానిపై కారణం చెప్పాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. తాము ఐసీయూలోకి రావాలంటే కారణం చెప్పాల్సిందేనని వైద్యులకు తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యులు నోరు జారారు. లోపలికి రాకుంటే డెడీ బాడీని ప్యాక్ చేసి పంపాలా అంటూ వ్యాఖ్యానించారు. వైద్యుల వ్యాఖ్యలతో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోనకు దిగారు. 

కాగా.. జనగామ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో ఉదయం 6:30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్‌ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. 

ALso REaD: విషాదం : ఫలించని వైద్యుల యత్నాలు.. డాక్టర్ ప్రీతి కన్నుమూత, మృత్యువుతో పోరాటంలో ఓటమి

ఇక, సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. శుక్రవారం సైఫ్‌ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్