కోలుకుని తిరిగి వస్తుందనుకున్నా.. కానీ ఇంతలోనే , ఇలా : ప్రీతి మరణంపై హరీశ్ రావు దిగ్భ్రాంతి

Siva Kodati |  
Published : Feb 26, 2023, 09:57 PM IST
కోలుకుని తిరిగి వస్తుందనుకున్నా.. కానీ ఇంతలోనే , ఇలా : ప్రీతి మరణంపై హరీశ్ రావు దిగ్భ్రాంతి

సారాంశం

ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి మృతిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి అరోగ్యవంతురాలై వస్తుందని అనుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రీతి మరణవార్త తెలుసుకున్న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించిందని హరీశ్ రావు తెలిపారు. పూర్తి అరోగ్యవంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హరీశ్ రావు హామీ ఇచ్చారు. 

ALso REad: విషాదం : ఫలించని వైద్యుల యత్నాలు.. డాక్టర్ ప్రీతి కన్నుమూత, మృత్యువుతో పోరాటంలో ఓటమి

కాగా.. జనగామ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో ఉదయం 6:30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్‌ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. 

ఇక, సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. శుక్రవారం సైఫ్‌ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu