హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 41.3 కోట్ల హెరాయిన్ సీజ్: మహిళ అరెస్ట్

By narsimha lode  |  First Published May 8, 2023, 9:24 PM IST

హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో  రూ. 41.3 కోట్ల విలువైన   హెరాయిన్ ను  డీఆర్ఐ అధికారులు  ఇవాళ సీజ్  చేశారు.  


హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో  మహిళ ప్రయాణీకురాలి నుండి  భారీగా హెరాయిన్ ను డీఆర్ఐ అధికారులు సీజ్  చేశారు.మాలావి నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు  వచ్చిన మహిళ ప్రయాణీకురాలి సూట్ కేసులో  5.9 కిలోల హెరాయిన్ ను  డీఆర్ఐ అధికారులు సీజ్  చేశారు.  మాలావి  నుండి వచ్చిన మహిళ  కదలికలు అనుమానస్పదంగా  ఉండడంతో  డీఆర్ఐ అధికారులు ఆమెను తనిఖీ చేశారు.   మహిళా ప్రయాణీకులరాలి  సూట్ కేసు నుండి  5.9 కిలోల హెరాయిన్ ను డీఆర్ఐ అధికారులు  గుర్తించారు. వెంటనే  హెరాయిన్ ను  డీఆర్ఐ అధికారులు సీజ్  చేశారు.

మహిళ ప్రయాణీకురాలిని  అరెస్ట్  చేశారు.  డీఆర్ఐ అధికారులు సీజ్ చేసిన  హెరాయిన్  విలువ రూ. 41.3 కోట్లు ఉంటుందని  అధికారులు తెలిపారు.గతంలో కూడ శంషాబాద్ ఎయిర్ పోర్టులో  డ్రగ్స్ సీజ్ అయ్యాయి.  శంషాబాద్  ఎయిర్ పోర్టుకు డ్రగ్స్ ను తీసుకువస్తున్న  వారిని  అధికారులు  అరెస్ట్  చేస్తున్నారు. 

Latest Videos

కడపులో క్యాప్యూల్స్ రూపంలో డ్రగ్స్  తరలిస్తున్న  ప్రయాణీకుడిని  అధికారులు అరెస్ట్  చేశారు. 2022  మే 4న  నిందితుడిన  అధికారులు అరెస్ట్  చేశారు.  నిందితుడి కడుపులో నుండి  108 క్యాప్యూల్స్ ను  వెలికి తీశారు.  దక్షిణాఫ్రికా  నుండి వచ్చిన   ప్రయాణీకుడి నుండి   డ్రగ్స్ రూపంలో  ఉన్న క్యాప్యూల్స్ ను వెలికితీశారు. 

2022 మే  2వ తేదీన  శంషాబాద్   విమానాశ్రయంలో  ఇద్దరు ప్రయాణీకుల నుండి  8 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నారు డీఆర్ఐ అధికారులు,. ఈ డ్రగ్స్ విలువ రూ. 80 కోట్లు ఉంటుందని చెప్పారు డీఆర్ఐ అధికారులు. టూరిస్ట్ వీసాపై హైద్రాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి డీఆర్ఐ  అధికారులు ఈ డ్రగ్స్ ను సీజ్ చేశారు.టాంజానియా, అంగోలాకు చెందిన ఇద్దరు ప్రయాణీకుల నుండి ఈ డ్రగ్స్ ను సీజ్ చేశారు.

2022 ఏప్రిల్ లో ఓ ప్రయాణీకుడి నుండి 1.15 కిలోల కొకైన్ ను హైద్రాబాద్ లో స్వాధీనం చేసుకొన్నారు.2021  ఆగష్టులో బెంగుళూరులో ఓ ప్రయాణీకుడిని కిలో కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నారులోదుస్తుల్లో  బంగారం  తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అరెస్ట్  చేశారు. ఈ ఘటన  ఈ ఏడాది ఫిబ్రవరి 25న చోటు  చేసుకుంది.   శంషాబాద్  ఎయిర్ పోర్టులో  ప్రయాణీకురాలి నుండి  విదేశీ కరెన్సీని సీజ్  చేశారు.  దుబాయి్ కు వెళ్లే  ప్రయాణీకురాలి నుండి భారీగా విదేశీ కరెన్సీ ఉండడంతో  అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఘటన  ఈ ఏడాది మార్చి 7న చోటు  చేసుకుంది.

click me!