తెలంగాణ ఏర్పాటు నిర్ణయం కఠినమైంది: యూత్ డిక్లరేషన్ విడుదల చేసిన ప్రియాంక గాంధీ

By narsimha lode  |  First Published May 8, 2023, 7:07 PM IST

తెలంగాణ ఏర్పడి  9  ఏళ్లు దాటినా కూడా  ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  ప్రియాంక గాంధీ  విమర్శించారు.  సరూర్ నగర్ సభలో  యూత్ డిక్లరేషన్ ను ను ప్రియాంక గాంధీ విడుదల చేశారు. 
 


హైదరాబాద్: యూత్ డిక్లరేషన్ ను  అమలు చేయకలేకపోతే  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూల్చేయాలని  ఆమె  కోరారు. సోమవారంనాడు  సరూర్ నగర్ స్టేడియంలో   కాంగ్రెస్ పార్టీ  నిర్వహించిన  యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.  యూత్ డిక్లరేషన్ ను  ప్రియాంక గాంధీ  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు.  తాను తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేనన్నారు. తెలంగాణ మీకు  నేల కాదు, తల్లి లాంటిదన్నారు.  

నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు.  తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదన్నారు.  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా   సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటుకు కీలకపాత్ర పోషించారన్నారు.  తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న తపన సోనియాకు ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు  నిర్ణయం చాలా కఠినమైందన్నారు.  

Latest Videos

యువత బలిదానాల వల్ల తెలంగాణ సాధ్యమైందని ఆమె అభిప్రాయపడ్డారు. .  తెలంగాణ సాధన కోసం  శ్రీకాంతాచారి  ఆత్మబలిదానం  చేశారని  ఆమె  గుర్తు  చేశారు.  తెలంగాణ కోసం యువత ఆత్మబలిదానం చేసుకుందని  ప్రియాంక గాంధీ  చెప్పారు. దేశం కోసం తన కుటుంబం కూడా ప్రాణ త్యాగాలు చేసిందన్నారు.  ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు  దేశం కోసం  అమరులయ్యారని  ఆమె గుర్తు  చేశారు.   సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లు దాటినా కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు  చేసుకున్నారని  ప్రియాంక గాంధీ  చెప్పారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీ నెరవేరిందా అని  ఆమె  ప్రశ్నించారు.  ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం  బీఆర్ఎస్ సర్కార్ కాదని  ప్రియాంక గాంధీ  పేర్కొన్నారు.  నయా జాగీర్ధార్ల తరహలో కేసీఆర్ పాలన ఉందని  ప్రియాంక గాంధీ విమర్శించారు. 

టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రాలు లీక్ చేశారని  ఆమె  ఆరోపించారు.  ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదని  ప్రియాంక గాంధీ విమర్శించారు.  ప్రభుత్వ యూనివర్శిటీలు  ఏర్పాటు  చేయడం లేదన్నారు. మరో వైపపు  ప్రైవేట్ యూనివర్శిటీలు విద్యార్ధులను దోచుకుంటున్నాయని  ప్రియాంకగాంధీ మండిపడ్డారు.  ప్రతి ఒక్కరిపై  అప్పుల భారం పెరిగిందన్నారు.  ప్రభుత్వ స్కూల్స్ లో  అప్పుల భారం పెరిగిందని ఆమె విమర్శించారు.  మీ డబ్బులు ఎక్కడికి వెళ్లాయో  ఆలోచించాలని  ప్రియాంక గాంధీ  కోరారు.  

also read:అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు: ఐదు అంశాలతో యూత్ డిక్లరేషన్

తనను మరో ఇందిరమ్మ అంటారన్నారు. అలా అన్నప్పుడు తన బాధ్యత మరింత పెరుగుతుందని  చెప్పారు.  40 ఏళ్లు అయినా ఇందిరను  తలుచుకుంటున్నారంటే  ఆమె అందించిన సేవలు అలాంటివని  ప్రియాంక గాంధీ  చెూప్పారు. తాను నయా ఇందిరమ్మ మాదిరిగా ఆమె ఆశయాలు నెరవేరుస్తానన్నారు.  యూత్ డిక్లరేషన్ లోని అంశాలను  కొన్నింటిని  ప్రియాంక గాంధీ  తన స్రసంగంలో  ప్రకటించారు.  అనంతరం  యూత్ డిక్లరేషన్  ను  ప్రియాంక గాంధీ విడుదల  చేశారు. 

click me!