Hyderabad: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. నేడు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
IMD issues Heavy Rain alert: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. నేడు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
వివరాల్లోకెళ్తే.. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేలా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని కూకట్ పల్లి, మణికొండ, గచ్చిబౌలి, సుచిత్ర, కొంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మర్పు.. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి రోడ్లపైకి వచ్చిన ప్రయాణికులు, పాదచారులు అసౌకర్యానికి గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కాగా, మరికొద్ది గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడటంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మరో రెండు రోజులు.. పలు జిల్లాల్లోనూ వర్షాలు
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
హైదరాబాద్ లో తగ్గిన ఉష్ణోగ్రతలు
ఎండల వేడిమి నుంచి హైదరాబాద్ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. భారీ వర్షాలతో హైదరాబాద్ ఉష్ణోగ్రతతు తగ్గాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. సోమవారం ఉదయం రాజేంద్రనగర్ లో అత్యధికంగా 52.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అంబర్ పేట, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జల్లులు గరిష్ట ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించాయనీ, నివాసితులకు ఎండల నుంచి ఉపశమనం కలిగించాయని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. షేక్ పేట ప్రాంతంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 25.7 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. మొన్నటి వరకు 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ఖైరతాబాద్, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో ఈ రోజు 25.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.