
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులను వర్షం పలకరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎల్బీ నగర్, నాగోలు, వనస్థలిపురం, రాజేంద్రనగర్, అత్తాపూర్‌లలో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాలను మేఘాలు కమ్మేశాయి. దీంతో ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు హైదరాబాద్ శివార్లలలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, వికారాబాద్‌లలో జిల్లాల్లో పలుచోట్ల వడగళ్ల వాన కురుస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న వర్షం కురిసింది.
హైదరాబాద్ నగరంలో మెరుపులు, వడగళ్ల వానలు, ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసిన సంగతి తెలిసిందే. మార్చి 21 వరకు నగరంలో చల్లటి వాతావరణం ఉంటుందని పేర్కొంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) కూడా హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.