వాడీ వేడీగా కృష్ణా రివర్ బోర్డు మీటింగ్: పోతిరెడ్డిపాడును వ్యతిరేకించిన తెలంగాణ, పాలమూరుపై ఏపీ అభ్యంతరం

By narsimha lodeFirst Published Jun 4, 2020, 3:23 PM IST
Highlights

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం వాడీ వేడీగా సాగింది. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు తమ తమ రాష్ట్రాల వాదనలు విన్పించారు.
 

హైదరాబాద్: కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం వాడీ వేడీగా సాగింది. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు తమ తమ రాష్ట్రాల వాదనలు విన్పించారు.

2020-21  ఏడాదికి గాను రెండు రాష్ట్రాలకు గాను నీటి కేటాయింపులతో పాటు రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులు తమ వాదనలను విన్పించారు.

కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయమై తెలంగాణ ప్రభుత్వం తరపున ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే అనుమతి పొందిన ప్రాజెక్టులను తాము నిర్మిస్తున్నట్టుగా తెలంగాణ స్పష్టం చేసింది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టుల విషయమై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు రజత్ కుమార్ ప్రయత్నించారు. 2014కు ముందే ఈ ప్రాజెక్టులకు అనుమతులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మరో వైపు ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్  ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ తెలిపింది.

అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టుగా తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయమై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణాన్ని సమర్ధించుకొంది.

also read:కృష్ణా రివర్ బోర్డు మీటింగ్: పోతిరెడ్డిపాడు, పాలమూరు ప్రాజెక్టుల భవితవ్యం తేలేనా?

కృష్ణా నది జలాల వినియోగం విషయంలో టెలీమెట్రీల ఏర్పాటు విషయంలో తెలంగాణ లేవనెత్తింది. తాము సూచించిన విధంగా కాకుండా టెలీమెట్రీలు ఏర్పాటు చేయడంతో వాటి వల్ల ఉపయోగం లేదని తెలంగాణ అభిప్రాయపడింది.

కృష్ణా బోర్డును విజయవాడకు తరలించాలని ఏపీ డిమాండ్ చేసింది. గతంలోనే ఈ బోర్డును తరలించేందుకు ప్రయత్నించారు. అయితే సాంకేతిక కారణాలతో బోర్డు తరలింపు నిలిచిపోయింది.

click me!