యువతుల ఫోటోల మార్ఫింగ్, రూ. 2 కోట్లు వసూలు: నిందితుడు వంశీపై ఫిర్యాదు

By narsimha lodeFirst Published Jul 28, 2020, 4:51 PM IST
Highlights

ఇన్‌స్టాగ్రామ్ లో మెడికల్ విద్యార్ధినుల ఫోటోలను  సేకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వంశీపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్ లో మెడికల్ విద్యార్ధినుల ఫోటోలను  సేకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వంశీపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇన్‌స్టాగ్రామ్ లో మెడికల్ విద్యార్ధినుల ఫోటోలను సేకరించి వంశీ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. ఈ మోసగాడి చేతిలో చిక్కిన యువతి హైద్రాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం నాడు ఫిర్యాదు చేసింది. 

ఇప్పటికే సుమారు 100 మంది మెడికల్ స్టూడెంట్స్ ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకొన్నాడు. మెడికల్ స్టూడెంట్స్ ను బ్లాక్ మెయిల్ చేసి సుమారు రూ. 2 కోట్లు వసూలు చేసినట్టుగా  సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. 

రాజమండ్రి, హైద్రాబాద్‌లలో వంశీపై  కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి, హైద్రాబాద్ పోలీసులు  వంశీని అరెస్ట్ చేశారు. తాజాగా వంశీ వలలో చిక్కుకొన్న యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


 

click me!