హైదరాబాద్‌లో అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.. రూ. 2.80 కోట్ల విలువైన గంజాయి సీజ్..

By Sumanth KanukulaFirst Published Oct 6, 2022, 10:35 AM IST
Highlights

హైదరాబాద్‌లో అంతరాష్ట్ర గంజాయి ముఠా గట్టు రట్టైంది. గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను హయత్ నగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.


హైదరాబాద్‌లో అంతరాష్ట్ర గంజాయి ముఠా గట్టు రట్టైంది. గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను హయత్ నగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు తూర్పు గోదావరి నుంచి ఛత్తీస్‌గఢ్‌కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2.80 కోట్ల విలువైన 1,300 కిలోల గంజాయిని, డీసీఎంను పోలీసులు సీజ్ చేశారు. అలాగే నిందుల వద్ద నుంచి రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఇదిలా ఉంటే.. ఇటీవల గంజాయి తరలిస్తున్న నలుగురుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొబ్బరి బొండాల ముసుగులో కొబ్బరి బొండాల ముసుగులో ఒడిస్సాలోని మల్కన్ గిరి నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా ఎల్బీనగర్, ఆలేరు ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 900 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు.. మహారాష్ట్ర రిజస్ట్రేషన్ ఉన్న డీసీఎం, కొబ్బరి బొండాలు, ఐదు సెల్ ఫోన్లు, రూ. 3,100 నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మహారాష్ట్రకు చెందిన యోగేష్ దత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మల్కన్ గిరి నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నాడని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఒడిస్సా రాష్ట్రంలో కేజీ గంజాయిని 2 నుంచి 3 వేల రూపాయలకు కొనుగోలు చేసి.. మహారాష్ట్రలో సుమారు రూ.15 వేలకు అమ్ముతున్నారని చెప్పారు. 

click me!