శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 2.58 కోట్ల బంగారం సీజ్

By narsimha lodeFirst Published Oct 6, 2022, 10:29 AM IST
Highlights

హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని సీజ్ చేశారు. దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి రూ. 2.58 కోట్ల విలువైన బంగారాన్నికస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 

హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి రూ. 2.58 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం నాడు సీజ్ చేశారు.

దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి లగేజీని స్కాన్ చేసిన అధికారులు  బంగారాన్ని గుర్తించారు.  ప్రయాణీకుడి నుండి  బంగారాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో కూడ శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం చేసుకున్న   ఘటనలు చోటుచేసుకున్నాయి. శంషాబాద్  ఎయిర్  పోర్టుతో పాటు దేశంలోని పలు చోట్ల అక్రమంగా బంగారం తరలిస్తున్న పలువురు పట్టుబడిన ఘటనలు నెలకొన్నాయి. 

ఈ ఏడాది సెప్టెంబర్ 15నన  దుబాయి  నుండి వచ్చిన ప్రయాణీకురాలి నుండి  268 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు. 14లక్షలుంటుందని అధికారులు అంచనా వేశారు.

ఈఏడాది జూలై23న దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుల నుండి  4 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజీ చేశారు. ఓ ప్రయాణీకుడు షూ సాక్స్ లో బంగారం దాచుకున్నాడు. మరొకరు తాను ధరించిన దుస్తుల్లో ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిన జేబులో బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 

also read:బంగారం గుట్టుర‌ట్టు.. సీక్రెట్ గా 23కేజీల గోల్డ్ స్మగ్లింగ్.. ఒకే నెలలోనే 121 కిలోలు ప‌ట్టివేత

ఈ ఏడాది ఆగస్టు 12న  శంషాబాద్  ఎయిర్ పోర్టులో ప్రయాణీకుడి నుండి బంగారం సీజ్ చేశారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి షూలో దాచుకొని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 

click me!