తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ కొత్త నినాదాన్ని ఎత్తుకొంది
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ కొత్త నినాదాన్ని ఎత్తుకొంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏపీకి ప్రయోజనంగా మారుతోందని టీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రారంభించింది.తెలంగాణకు నష్టం చేకూర్చే పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అని టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏపీకి ప్రయోజనంగా మారుతోంది.. తెలంగాణకు నష్టమయ్యే అవకాశం ఉందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏపీకే ప్రయోజనమయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడ ఇతర పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తోంది. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ఈ కూటమిలో చేరేందుకు సంసిద్దతను వ్యక్తం చేశాయి.ఈ పార్టీల మధ్య పొత్తుల చర్చలు సాగుతున్నాయి.
మహాకూటమి అభ్యర్థులను ప్రకటించేలోపుగానే టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని పూర్తి చేసేలా కేసీఆర్ ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కొత్త నినాదాన్ని తెరమీదికి తెచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏపీకి ప్రత్యేక హోదాను తీసుకురానుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తే పరిశ్రమలు ఏపీలో ఎక్కువగా ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ తరుణంలో తెలంగాణలో పెట్టుబడులు రాక పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశాలు తక్కువగా ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
శుక్రవారం నాడు ఇబ్రహీంపూర్ వద్ద జరిగిన సభలో మంత్రి హారీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏపీకి ప్రయోజనంగా మారుతోందని.. తెలంగాణకు లాభం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణకు వ్యతిరేకించిన చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకొందని హరీష్ రావు ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు
పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు