క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు : ఉత్తమ్ వార్నింగ్, కాంగ్రెస్‌లో చేరిన రమేష్ రాథోడ్

By Arun Kumar PFirst Published Sep 21, 2018, 2:43 PM IST
Highlights

ముందస్తు ఎన్నికలకు సిద్దమైన టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నేతల జంపింగ్ లు ఎక్కువయ్యాయి. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో పేర్లు లేని నాయకులు పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. కొందరయితే మరో అడుగు ముందుకేసీ పార్టీని వీడుతున్నారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడిన రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇవాళ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో భారీ అనుచరగణంతో రమేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ...  కాంగ్రెస్ నాయకులు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఉత్తమ్ హెచ్చరించారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి నాయకులంతా కలిసి కట్టుగా ఉంటూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. రాహుల్ గాంధి చెప్పినట్లు అందరం నడుచుకుందామని ఉత్తమ్ సూచించారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ...గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుందని గుర్తు చేశారు. కానీ ఈసారి మొత్తం పదికి పది స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరడం ఖాయమన్నారు. రమేష్ రాథోడ్, సుమన్ రాథోడ్ వంటి నాయకుల చేరికతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైందన్నారు. 

ఇక తెలంగాణ ఓటర్ లిస్టు జాబితా నుండి దాదాపు 21 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్, మోదీలు ఎలక్షన్ కమీషన్ తో కుమ్మకై ఓట్లను తొలగించారని ఆరోపించారు. గతంలో రెండు కోట్ల ఎనబై లక్షలున్న ఓటర్లు ఇప్పుడు రెండు కోట్ల అరవై లక్షలకు ఎలా తగ్గుతారని ప్రశ్నించారు.  ప్రతి సంవత్సరం ఓటర్లు పెరగాలి కానీ తగ్గడం ఏంటని ఉత్తమ్ ప్రశ్నించారు. 

ఈ నాలుగన్నరేళ్లలో తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టే అవకాశం వచ్చిందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరగడం లేవని కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని ఉత్తమ్ అన్నారు. 

click me!
Last Updated Sep 21, 2018, 3:04 PM IST
click me!