ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం : ఓల్డ్ సిటీ వాసి దుర్మరణం

Published : Sep 21, 2018, 03:21 PM ISTUpdated : Sep 21, 2018, 03:24 PM IST
ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం : ఓల్డ్ సిటీ వాసి దుర్మరణం

సారాంశం

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను తీర్చడంతో పాటు ప్రయాణికులు సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో నగరం చుట్టూ అవుటర్ రింగు రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే అనుకున్నట్లే నగరంలోకి భారీ వాహనాల రాక తగ్గడంతో ట్రాఫిక్ సమస్యలు కాస్త తగ్గాయి. అయితే విశాలంగా వున్న అవుటర్ పై వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా అవుటర్ పై మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.  

హైదరాబాద్ పాత నగరానికి చెందిన ఓ సిక్కు సామాజికవర్గానికి చెందిన కుటుంబం కర్ణాటకలోని బీదర్ కు కారులో బయలుదేరారు.  అయితే కారు అవుటర్ రింగ్ రోడ్డుపై  ప్రయాణిస్తూ ఘోర ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న కారు ఓ లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu