హరీష్ రావుకి తృటిలో తప్పిన ప్రమాదం

Published : Sep 29, 2018, 12:29 PM ISTUpdated : Sep 29, 2018, 12:38 PM IST
హరీష్ రావుకి తృటిలో తప్పిన ప్రమాదం

సారాంశం

ఊహించని పరిణామంతో భయబ్రాంతులైన కార్యకర్తలు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా.. ఈ ఘటనలో హరీష్ రావు కి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.

తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావుకి తృటిలో పెను ప్రమాదం తప్పింది.  టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు హరీష్ రావు.. సంగారెడ్డి వెళ్లారు.  కాగా,... ఈ సమావేశానికి కార్యకర్తలు వేల సంఖ్యలో హాజరయ్యారు.

తమ ప్రియతమ నేత సంగారెడ్డి వచ్చారనే ఆనందంతో కొందరు బాణసంచా పేల్చడంతో అనుకోకుండా ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో.. సభా ప్రాంగణమంతా పొగలు కమ్ముకున్నాయి. ఊహించని పరిణామంతో భయబ్రాంతులైన కార్యకర్తలు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా.. ఈ ఘటనలో హరీష్ రావు కి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.

వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి వేరే ప్రాంతానికి సురక్షితంగా పంపించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Top 5 Bathukamma Songs: యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న టాప్ 5 బతుకమ్మ పాటలు ఇవే
Hyderabad : హైదరాబాద్‌లో అంతరిక్షం నుండి కనిపించేంత భారీ చెత్తకొండలా..! ఎక్కడున్నాయో తెలుసా?