బీజేపీలో చేరిన బాబు మోహన్

Published : Sep 29, 2018, 11:32 AM ISTUpdated : Sep 29, 2018, 02:42 PM IST
బీజేపీలో చేరిన బాబు మోహన్

సారాంశం

 బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.

టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్‌ బీజేపీలో చేరారు. బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన.. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 

టీఆర్ఎస్ టికెట్‌ దక్కకపోవడంతో గత కొద్దిరోజులుగా బాబుమోహన్‌ అసంతృప్తిగా ఉన్నారు. అసెంబ్లీ రద్దు అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన 105 మందితో కూడిన తొలిజాబితాలో ఆయన పేరు లేని విషయం తెలిసిందే. ఈ జాబితాలో తాజా మాజీలైన ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. చెన్నూరులో నల్లాల ఓదెలు స్థానంలో ఎంపీ బాల్క సుమన్‌ను, ఆందోల్‌లో బాబుమోహన్‌ స్థానంలో పాత్రికేయుడు చంటి క్రాంతికిరణ్‌ను‌ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్న బాబుమోహన్‌.. ఈరోజు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

read more news

దక్కని టికెట్... బాబు మోహన్ సంచలన కామెంట్స్

బాబూ మోహన్ ను కాదని టికెట్: ఎవరీ క్రాంతి?

కోపంతో కార్యకర్తను తన్నబోయిన బాబు మోహన్ (వీడియో)

బాబు మోహన్ కి చుక్కలు చూపించిన గ్రామస్థులు

జర్నలిస్టు క్రాంతి పై బాబుమోహన్ ఫైర్

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్