150 మందిని కాపాడిన చింతచెట్టు ఇదే...వరద మృతులకు నివాళి

By Arun Kumar PFirst Published Sep 29, 2018, 12:14 PM IST
Highlights

అది 1908 సంవత్సరం. హైదరాబాద్ నగరమంతా మూసీ పరివాహక ప్రాంతంలోనే విస్తరించి ఉండేది. అయితే ఆ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్ని వరదల్లో చిక్కుకున్నాయి. రోజురోజుకు వరద ఉదృతి పెరిగిపోవడంతో నగరవాసులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పటికే ఈ వరదలకు చాలా మంది బలయ్యారు. అప్పుడే ఓ భారీ వృక్షం మీకు నేనున్నానంటూ నగరవాసులకు అభయమిచ్చింది. ఈ భారీ ఉపద్రవం నుండి దాదాపు 150 మందిని కాపాడి కన్నతల్లి మాదిరిగా అక్కున చేర్చుకుంది. ఇలా ఈ భారీ వరదలకు ఆ చెట్టు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. 

మూసీ వరదల నుండి నగరవాసులను కాపాడిన ఆ చింతచెట్టు ఇప్పటికీ ఉస్మానియా దవాఖాన ఆవరణలో ఠీవీగా నిల్చుంది. ఈ చారిత్రక వృక్షం వద్ద ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్, సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్, దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్, దక్కన్ అకాడమీ, ఛత్రి సంస్థల ఆధ్వర్యంలో మూసీ వరద మృతుల స్మారక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అధ్యక్షుడు వేదకుమార్ మాట్లాడుతూ...  150 మందిని కాపాడిన ఈ  చింతచెట్టును ఇప్పుడే కాదు...భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఇది హైదరాబాద్ చరిత్రలో చిరకాలం నిలిచిపోతుందని అన్నారు. ఇలాంటి చారిత్రక వారసత్వ సంపదలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని వేదకుమార్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్ సెక్రటరీ సజ్జాద్‌షాహిద్, సజ్జన్‌సింగ్, ఆసిఫ్‌అలీఖాన్, బ్రదర్ వర్గీస్, ఆర్‌ఎంవో శ్రీనివాస్‌బాబు, కొమ్మిడి నర్సింహారెడ్డి, ఆనంద్ రాజ్‌వర్మ, అజిత్‌సింగ్, వేణుగోపాల్, సంగం రామకృష్ణ, పిట్టల శ్రీశైలం, సంఘమిత్ర మాలిక్, అశ్వక్, బసవరాజ్, దామోదర్, శోభాసింగ్, ఎమ్మెస్ రావు, ఎంహెచ్ రావు తదితరులు పాల్గొన్నారు.

click me!