ప్రాజెక్టులపై మీరు మాట్లాడొద్దు

Published : Nov 08, 2016, 12:03 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ప్రాజెక్టులపై మీరు మాట్లాడొద్దు

సారాంశం

కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు  ఫైర్ 2018లోపు లక్ష ఎకరాలకు సాగునీరు

భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు.. .కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలకు ప్రాజెక్టులపై మాట్లాడే హక్కులేదని విమర్శించారు. ఆయన మంగళవారం హైదరాబాద్ లో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.700 కోట్లు పంపిణీ చేస్తే...రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.400 కోట్లు పంపిణీ చేసిందని అన్నారు.

మిడ్ మానేరు నిర్వాసితులకు కుటుంబ పరిహారం కింద రూ.2 లక్షల చొప్పున త్వరలోనే అందచేస్తామన్నారు. ప్రాజెక్టులకు కావాల్సిన భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇస్తే 123 జీవో ప్రకారం 15 రోజుల్లో పరిహారం చెల్లిస్తామని హరీశ్ తెలిపారు. 2018వరకు ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu