మూడో విడత రుణమాఫీ

Published : Nov 07, 2016, 11:39 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
మూడో విడత రుణమాఫీ

సారాంశం

రూ. 2019 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాణ రైతులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా మూడో విడత మాఫీకి సంబంధించి నిధులను విడుదల చేసింది. రూ. 17 వేల కోట్ల రుణమాఫీలో మూడో విడత కు సంబంధించి 2019.19 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మొదటి విడతలో 2019.99 కోట్లను జులైలో విడుదల చేయగా, తాజా చెల్లింపుతోమొత్తం 17వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, దానిని నాలుగు విడతలుగా చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ప్రకటించింది.

 

ఈ మేరకు 2014 సెప్టెంబర్‌లో మొదటి విడతగా ఏకమొత్తంగా 4వేల 250 కోట్లను విడుదల చేసింది. రెండో విడతలో 4 వేల 250 కోట్లను రెండు దఫాలుగా చెల్లించింది. మొత్తంగా ఇప్పటివరకు 12వేల 375.18 కోట్లను రైతు రుణమాఫీ కింద ప్రభుత్వం చెల్లించినట్లయింది. ఇక వచ్చే ఏడాది మిగిలిన 4 వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది.

 

PREV
click me!

Recommended Stories

తెలుగోళ్లకు మాత్రమే ఈ ఆఫర్.. SBI లో అకౌంట్ ఉంటే చాలు కోటి రూపాయలు
కేసీఆర్ దగ్గరకెళ్లి మరీ దండంపెట్టిన రేవంత్.. KTR Reaction | Revanth Respect | Asianet News Telugu