దూలపల్లి పరువు హత్య: హరీష్‌ను చంపిన నిందితులను శిక్షించాలన్న పేరేంట్స్

By narsimha lode  |  First Published Mar 3, 2023, 4:03 PM IST

దూలపల్లిలో  హరీష్ అనే యువకుడిని  చంపిన  నిందితులను కఠినంగా  శిక్షించాలని  మృతుడి కుటుంబ సభ్యులు  కోరుతున్నారు.   
 


హైదరాబాద్:  హరీష్ ను  చంపిన  నిందితులను  కఠినంగా  శిక్షించాలని కుటుంబ సభ్యులు  కోరుతున్నారు. 

ప్రేమించిన యువతిని పెళ్లి  చేసుకున్న  హరీష్ ను  యువతి  బంధువులు అత్యంత దారుణంగా హత్య  చేశారు.

Latest Videos

గత  నెల  22న డ్యూటీకి వెళ్తున్నానని  చెప్పి వెళ్లిన  హరీష్  చనిపోయిన తర్వాతే  తమకు  తెలిసిందని  కుటుంబ సభ్యులు  చెబుతున్నారు .  దూర ప్రాంతాలకు డ్యూటీకి వెళ్లిన సమయంలో  కూడ రోజుల తరబడి  ఫోన్ ను  స్విచ్ఛాప్  చేసి ఉండేవారి  హరీష్ తల్లి గుర్తు  చేసుకున్నారు.  ఈ దఫా కూడా  హరీష్  సుదూర ప్రాంతాల్లో విధులకు  వెళ్లి ఉన్న కారణంగా  ఫోన్  స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాడని  భావించామన్నారు.

గత నెల  22వ తేదీ నుండి  యువతి కూడా కన్పించకుండా పోవడంతో  యువతి  సోదరుడు  తన చిన్న అల్లుడికి ఫోన్  చేశారని  హరీష్ తల్లి  చెప్పారు.  అయితే  ఈ విషయమై  తన అల్లుడు తన బిడ్డ ద్వారా హరీష్  కోసం  తనకు  ఫోన్  చేయించారని   ఆమె మీడియాకు  చెప్పారు. అయితే  ఆ రోజు నుండి  హరీష్  ఇంటికి రాలేదన్నారు.  యువతే  హరీష్ పై ఒత్తిడి తీసుకురావడంతో  ఆమెను తీసుకుని హరీష్  వెళ్లిపోయి ఉంటారని  కుటుంబసభ్యులు  అనుమానం వ్యక్తం  చేశారు.  

యువతిని  కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు తాము కూడా  హరీష్ కోసం  గాలింపు  చర్యలు చేపట్టినట్టుగా  కుటుంబ సభ్యులు  చెప్పారు. హరీష్ ఆచూకీ కనిపెట్టి  యువతి  బంధువులు  దారుణంగా హత్య  చేశారని హరీష్ తల్లి చెబుతున్నారు. 

also read:దూలపల్లిలో పరువు హత్య: పోలీసుల అదుపులో ఒకరు

హరీష్ ను హత్య  చేసిన నిందితులను  కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.    జైలు నుండి  నిందితులు బయటకు రాకుండా  పోలీసులు చర్యలు తీసుకోవాలని  హరీష్  కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
 

click me!