
హైదరాబాద్‌లో జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న యువకులను టార్గెట్ చేసుకుని ఓ ముఠా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ దందా మొదలుపెట్టింది. బాడీ ఫిట్ అవుతుందని మాయమాటలు చెప్పి యువకులకు వీటిని విక్రయిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా 180 స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు, 1100 ట్యాబ్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.