హరికృష్ణ మృతి: మూడు రోజుల్లోనే పుట్టినరోజు.... ఇంతలోనే దుర్మరణం

By narsimha lodeFirst Published Aug 29, 2018, 9:29 AM IST
Highlights

మూడు రోజుల్లో పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకలు జరపొద్దు.. పుట్టినరోజు వేడుకలకయ్యే ఖర్చును కేరళ వరద బాధితుల కోసం ఇవ్వాలని తన అభిమానులకు చెప్పాలని లేఖను తయారు చేయించారు


హైదరాబాద్: మూడు రోజుల్లో పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకలు జరపొద్దు.. పుట్టినరోజు వేడుకలకయ్యే ఖర్చును కేరళ వరద బాధితుల కోసం ఇవ్వాలని తన అభిమానులకు చెప్పాలని లేఖను తయారు చేయించారు.ఈ లేఖను మీడియాకు విడుదల చేయకముందే  ఆయన మృతి చెందారు.

1956 సెప్టెంబర్ రెండో తేదిన హరికృష్ణ నిమ్మకూరులో పుట్టారు.  ప్రతి ఏటా తన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది  పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకొన్నారు.

ఈ మేరకు తన సన్నిహితుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేత ఓ లేఖను తయారు చేయించుకొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా వేడుకలను నిర్వహించకూడదని అభిమానులకు విన్నవించేలా ఆ లేఖను సిద్దం చేయించారు. ఆ లేఖ ఇంకా హరికృష్ణకు అందాల్సి ఉంది. ఈ లోపుగానే హరికృష్ణ మృతి చెందాడు. 

మూడు రోజుల్లో పుట్టిన రోజు... ఈ లోపుగానే నార్కట్‌పల్లి మండలం అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందాడు. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని భావించిన హరికృష్ణ ... శాశ్వతంగా ఈ లోకం విడిచివెళ్లారు.

నిజాయితీగా తన మనసులో మాటలను బయటపెట్టే  వ్యక్తిత్వం హరికృష్ణ స్టైల్. అయితే టీడీపీలో కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని ఆయన కోరుకొనేవారు. తనకు తెలిసిన కార్యకర్తలు, నేతలకు న్యాయం చేయాలని ఆయన కోరుకొనేవారని టీడీపీ వర్గాలు గుర్తు చేసుకొంటున్నాయి.

 

 

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

రోడ్డు ప్రమాదంలో హరిక్రిష్ణ దుర్మరణం (ఫోటోలు)

ఆస్పత్రికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్: ఇంటికి చేరుకుంటున్న బంధువులు

హరికృష్ణ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

click me!