బాబుతో హరికృష్ణకు విబేధాలు, ఎందుకంటే?

By narsimha lodeFirst Published Aug 29, 2018, 9:00 AM IST
Highlights

నందమూరి హరికృష్ణ టీడీపీలో చంద్రబాబుకు కొన్ని సమయాల్లో మింగుడుపడకుండా వ్యవహరించారు.కొన్ని విషయాల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా హరికృష్ణ పనిచేశారు. 

హైదరాబాద్:నందమూరి హరికృష్ణ టీడీపీలో చంద్రబాబుకు కొన్ని సమయాల్లో మింగుడుపడకుండా వ్యవహరించారు.కొన్ని విషయాల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా హరికృష్ణ పనిచేశారు. తాను అనుకొన్న పనిని హరికృష్ణ చేసేవాడు.రాష్ట్ర విభజన నిర్ణయాన్ని హరికృష్ణ వ్యతిరేకించాడు.

రాష్ట్ర విభజన సమయంలో ఎంపీ పదవికి ముందుగానే హరికృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. అయితే మరోసారి రాజ్యసభ పదవిని ఇవ్వాలని కూడ హరికృష్ణ చంద్రబాబును కోరారు.టీటీడీ ఛైర్మెన్ పదవిని హరికృష్ణకు ఇస్తారని ప్రచారం సాగింది. కానీ ఎలాంటి పదవి దక్కలేదు. 

1995లో టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబునాయుడు వైపు హరికృష్ణ నిలిచారు.  తండ్రిని కూడ కాదని ఆనాడు  పార్టీని రక్షించుకొనేందుకు గాను ఆనాడు చంద్రబాబునాయుడు వైపు నిలిచారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్టీఆర్ సీఎం పదవి నుండి తప్పించిన తర్వాత చంద్రబాబునాయుడు సీఎం పదవిని చేపట్టిన తర్వాత హరికృష్ణ కీలకంగా వ్యవహరించారు. హరికృష్ణ అప్పట్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు.1996లో హిందూపురం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో హరికృష్ణ విజయం సాధించారు.

ఎమ్మెల్యేగా కానప్పటికీ మంత్రివర్గంలోకి హరికృష్ణను తీసుకొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రి వర్గం నుండి హరికృష్ణ తప్పుకొన్నారు. ఆ తర్వాత చంద్రబాబుతో విబేధించారు.  టీడీపీకి వ్యతిరేకంగా అన్న టీడీపిని ఏర్పాటు చేశారు హరికృష్ణ. అన్న టీడీపీ రాజకీయంగా పెద్దగా సక్సెస్ కాలేదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనే అన్న టీడీపీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

అన్ని టీడీపీ ద్వారా టీడీపీని దెబ్బతీస్తారని విపక్షాలు ఆనాడు భావించాయి. కానీ,  హరికృష్ణ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.ఆ తర్వాత రాజకీయంగా దూరంగా ఉంటున్నారు. ఆ క్రమంలోనే 2007 చివర్లో..2008 ఆరంభంలో చంద్రబాబునాయుడుతో సంబంధాలు మెరుగయ్యాయి. పార్టీలో హరికృష్ణకు స్థానం దక్కింది.

హరికృష్ణకు పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించారు.2008లోనే రాజ్యసభ పదవిని కూడ చంద్రబాబునాయుడు కట్టబెట్టారు. 2009లో నందమూరి  నారా కుటుంబాలు ఒక్కటేనని సంకేతాలు ఇచ్చే ప్రయత్నాలు చేశారు.

2009 ఎన్నికలకు ముందు హరికృష్ణ, బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్, జానకీరామ్ తదితరులు బాబుతో సమావేశమయ్యారు.ఈ సమావేశం తర్వాత 2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఆ తర్వాత పరిణామాల్లో రాష్ట్ర విభజనను హరికృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర విభజనకు టీడీపీ అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ హరికృష్ణ మాత్రం విబేధించారు. 

2014 ఎన్నికలకు ముందు తన పదవీకాలం పూర్తి కాకముందే రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా చేశారు. ఆ తర్వాత కూడ రాజ్యసభ పదవిని కోరుకొన్నారు. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో హరికృష్ణకు  చంద్రబాబునాయుడు రాజ్యసభ సభ్యత్వం కల్పించలేకపోయారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తనయుడు జానకీరామ్ చనిపోయిన తర్వాత హరికృష్ణ ఎక్కువగా ఇంటి వద్దనే ఉంటున్నారు.

లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకొన్న సమయంలోనే హరికృష్ణ అమరావతికి వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించే కార్యక్రమంలో కుటుంబ
సభ్యులతో కలిసి పనిచేశారు. 

రోడ్డు ప్రమాదంలో హరిక్రిష్ణ దుర్మరణం (ఫోటోలు)

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

హరికృష్ణ మృతి: మూడు రోజుల్లోనే పుట్టినరోజు.... ఇంతలోనే దుర్మరణం

ఆస్పత్రికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్: ఇంటికి చేరుకుంటున్న బంధువులు

కామినేని ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్

click me!