
నేడు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖల నుండి శుభాకాంక్షల వెల్లువలా వస్తున్నాయి. అందులో టాలీవుడ్ నటి సమంత కేటిఆర్ ను పొగస్తలతో ముంచెత్తింది. ట్విట్టర్ వేదికగా అత్యంత ప్రియమైన నాయకుడికి శుభాకాంక్షలు. నిజమైన స్ఫూర్తి, నమ్మకం కలిగించే మీతో పరిచయం ఏర్పడడం గౌరవంగా భావిస్తున్నాను సర్ అని సమంత తన స్టైల్ లో ట్వీట్ చేసింది.
సమంతా ట్విట్ కు సమాధానం ఇచ్చిన కేటీఆర్ ఇలా ట్యాగ్ చేశారు.
మా చేనేత ప్రచారకర్తకు ధన్యవాదాలు. మీ ఫోకస్, డెడికేషన్‌తో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చారు.
అందుకు సమంత స్పందిస్తూ ‘ధన్యవాదాలు సర్’ అని తెలిపింది.