సిట్ విచారణకు నవదీప్

Published : Jul 24, 2017, 11:34 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
సిట్ విచారణకు నవదీప్

సారాంశం

సిట్ విచారణకు హాజరైన నవదీప్ నవదీప్ పై తీవ్రమైన ఆరోపణలు డ్రగ్స్ వినియోగం, విక్రయంలో పాత్ర నిగ్గుతేల్చనున్న సిట్ బృందం

డ్రగ్ కేసులో యువ హీరరో నవదీప్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన సోమవారం ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకుని విచారణ సంఘం ముందు హాజరయ్యారు. ఇప్పటికే పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్ తదితర ప్రముఖులను విచారించారు సిట్ అధికారులు. ఇంకా హీరోయిన్ ఛార్మి, ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్ తోపాటు మరికొందరిని విచారించాల్సి ఉంది.

డ్రగ్ వినియోగంతోపాటు డ్రగ్ సప్లై లో కూడా నవదీప్ కీలక వ్యక్తిగా సిట్ బృందం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం సేకరించారు సిట్ సభ్యులు. నవదీప్ స్వయంగా పబ్ కూడా నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లతో స్నేహం చేసి తన పబ్ కు తీసుకువెళ్లి డ్రగ్స్ అందిస్తాడన్న ఆరోపణలున్నాయి. వీటన్నిటిపైనా ఈరోజు సాయంత్రం వరకు నవదీప్ ను అన్ని కోణాల్లో విచారించే చాన్స్ ఉందంటున్నారు. అవసరమైతే బ్లడ్ షాంపిల్స్ కూడా సేకరించనున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu