సిట్ కు ఎదురు తిరిగిన ఛార్మి

First Published Jul 24, 2017, 12:07 PM IST
Highlights
  • సిట్ దర్యాప్తును ఎధిరించిన ఛార్మి
  • హైకోర్టులో ఛార్మి పిటిషన్
  • బ్లడ్ షాంపిల్స్ సేకరణకు అభ్యంతరం
  • మధ్యాహ్నం విచారణకు వచ్చే చాన్స్
  •  

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కేసులో సంచనాలు సృష్టిస్తుంటే అంతకంటే మరో సంచనలం సృష్టించింది సినీ హీరోయిన్ ఛార్మి. సిట్ విచారణకు ఆమె సిట్ విచారణకు ఎదురుతిరిగింది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఛార్మి. సిట్ విచారణను కోర్టులో చాలెంజ్ చేసిన తొలి హీరోయిన్ గా చార్మి నిలిచింది.

అందరిలాగే తాను బ్లడ్ షాంపిల్స్ ఇవ్వలేనని, ఈ విషయంలో తన బ్లడ్ షాంపిల్స్ తీసుకోకుండా సిట్ బృందానికి ఆదేశాలు ఇవ్వాలని ఛార్మి హైకోర్టులో పిటిషన్ వేసింది. అలాగే తన జుట్టును కూడా షాంపిల్ గా తీసుకునేందుకు అభ్యంతరం తెలిపింది.  సిట్ విచారణ పట్ల తనకు అభ్యంతరాలున్నాయని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం ఆమె పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు షాంపిల్స్ సేకరించే విషయమై ఆమె న్యాయస్తానంలో పిటిషన్ వేసింది.

మరోవైపు డ్రగ్ కేసులో సినీ ప్రముఖులకు పెద్ద శిక్షలేమీ పడే అవకాశాలే లేవని న్యాయ నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ పలువురిని సిట్ అధికారులు వరుసపెట్టి విచారణ జరుపుతున్నారు. ఇందులోభాగంగా కొందరు సినీ ప్రముఖుల నుంచి బ్లడ్ షాంపుల్స్ కూడా సేకరించారు సిట్ అధికారులు. ఆ బ్లడ్ షాంపుల్స్ విచారణలో వారి ప్రమేయాన్ని ఏమాత్రం తేల్చలేవన్న ప్రచారమూ ఉంది.

మొత్తానికి తెలంగాణ ఎక్సైజ్ అధికారులకు తొలిసారి కఠిన పరీక్ష ఎదురైంది. ఛార్మి హైకోర్టుకు వెళ్లడంతో ఆమె కేసులో వచ్చే తీర్పుబట్టి మరికొందరు సినీ ప్రముఖులు కూడా హైకోర్టుకు క్యూ కట్టే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఛార్మి విషయంలో కోర్టు తీర్పును బట్టి మిగతా సినీ ప్రముఖుల కార్యాచరణ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయినప్పటికీ సిట్ విచారణ ఏమాత్రం అక్కరకొచ్చేదికాదన్న ప్రచారం ఇటు న్యాయవాదలు నుంచి వినిపిస్తున్నమాట.

click me!