హనుమాన్ జయంతి: వైన్ షాపులు, బార్లు బంద్.. ఊరేగింపు మార్గాన్ని ప‌రిశీలించిన హైదరాబాద్ పోలీసులు

By Mahesh Rajamoni  |  First Published Apr 4, 2023, 4:44 PM IST

Hyderabad: హనుమాన్ జయంతి సందర్భంగా వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా బార్లు, వైన్ షాపులు మూసివేయ‌బ‌డ‌తాయ‌ని హైదరాబాద్ నగర పోలీసులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. 
 


Wine shops, bars to stay shut on Hanuman Jayanthi: హనుమాన్ జయంతి సందర్భంగా వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా బార్లు, వైన్ షాపులు మూసివేయ‌బ‌డ‌తాయ‌ని పోలీసులు వ‌ర్గాలు పేర్కొన్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. ఏప్రిల్ 6న హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైద‌రాబాద్ నగరంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు వైన్, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్బులు, పబ్బులు, ఫైవ్ స్టార్ హోటల్ బార్ రూమ్లకు ఈ నిబంధ‌న‌లు వర్తింపజేస్తూ రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Latest Videos

undefined

హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా జరగాలనీ, హైదరాబాద్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలిపారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తామని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మ‌ద్యం అక్ర‌మ విక్ర‌యాలు జ‌రిపితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా హెచ్చ‌రించారు. 

హ‌నుమాన్ జ‌యంతి ఊరేగింపు రూట్ ప‌రిశీల‌న‌.. 

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో సంబంధిత అధికారులు, నిర్వాహ‌కుల‌తో క‌లిసి ఊరేగింపు రూట్ ను తనిఖీ చేశారు. హనుమాన్ జయంతి వేడుకల నిర్వహణపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ప్రభుత్వ శాఖల అధికారులు, నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గురువారం హనుమాన్ జయంతి ఊరేగింపు నిర్వహించే మార్గాన్ని పోలీసులు సంయుక్తంగా పరిశీలించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఊరేగింపు మార్గాన్ని, సమయాలను స‌రిగ్గా పాటించాలని కమిషనర్ కోరారు. ఈ సమావేశంలో ఈఎంఆర్ఐ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్, ఆర్అండ్బీ, అగ్నిమాపక శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్  అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు బజరంగ్ ద‌ళ్, వీహెచ్ పీ స‌హా ప‌లు హిందూ సంఘాల సభ్యులు కూడా ఈ స‌మావేశంలో ఉన్నారు.

click me!