Half Day Schools: తెలంగాణలో (TS Weather) రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. మార్చి నెల ప్రారంభం కాకుండానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా హాఫ్‌డే పాఠశాలలను అమలు చేయాలని ఆదేశించింది.
Half Day Schools: తెలంగాణలో (TS Weather) పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు ముదురుతున్నాయి. మార్చి నెల ప్రారంభం కాకుండానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వేసవికాలం ప్రారంభం కాకముందే.. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు (Day Temperatures) 32 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
ఈ తరుణంలో రేవంత్ సర్కార కీలక నిర్ణయం తీసుకుంది. పగటిపూట ఎండలు విపరీతంగా ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాఫ్ డే పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ మేనేజ్‌మెంట్లతోపాటు అన్ని పాఠశాలల్లో మార్చి 15 నుంచి హాఫ్‌డే పాఠశాలలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం శనివారం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభం కాగా.... మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాన్ని(Midday Meal)) గం.12.30 లకు అందజేయనున్నారు. మరోవైపు.. 10వ తరగతి (SSC Exams)పరీక్షలకు కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం నుంచి పూట బడులను నిర్వహిస్తారని విద్యాశాఖ పేర్కొంది.