హైద‌రాబాద్ స‌హా రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వ‌డ‌గాల్పులు

By Mahesh Rajamoni  |  First Published May 20, 2023, 12:28 PM IST

Hyderabad: హైదరాబాద్ లో ఎండ‌లు దంచి కొడుతున్నాయి. వడగాల్పులు తీవ్ర‌త సైతం న‌గ‌ర‌వాసుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. న‌గ‌రంలో వేడిగాలుల తీవ్ర‌త పెర‌గ‌డంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా న‌మోద‌వుతున్నాయి.
 


Heatwave-Hyderabad: హైదరాబాద్ లో ఎండ‌లు దంచి కొడుతున్నాయి. వడగాల్పులు తీవ్ర‌త సైతం న‌గ‌ర‌వాసుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. న‌గ‌రంలో వేడిగాలుల తీవ్ర‌త పెర‌గ‌డంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా న‌మోద‌వుతున్నాయి. శుక్రవారం 42.6 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్న హైదరాబాద్ లో వడగాలులు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇదే ప‌రిస్థితి ఉండ‌గా,  ఖైరతాబాద్ అత్యంత వేడి ప్రాంతంగా అవతరించిందని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్ డీపీఎస్) నివేదిక వెల్లడించింది. ఖైరతాబాద్ తో పాటు హైదరాబాద్ లోని మరో ఎనిమిది ప్రాంతాల్లో వడగాల్పులు వీచడంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఆ ప్రాంతాలు ఇలా ఉన్నాయి.

ఖైరతాబాద్ (42.5 డిగ్రీల సెల్సియస్)
చార్మినార్ (41.1 డిగ్రీల సెల్సియస్)
నాంపల్లి (40.7 డిగ్రీల సెల్సియస్)
బండ్లగూడ (40.3 డిగ్రీల సెల్సియస్)
హిమాయత్ న‌గ‌ర్ (40.3 డిగ్రీల సెల్సియస్)
ముషీరాబాద్ (40.3 డిగ్రీల సెల్సియస్)
ఆసిఫ్ న‌గ‌ర్ (40.3 డిగ్రీల సెల్సియస్)
సైదాబాద్ (40.3 డిగ్రీల సెల్సియస్)
షేక్ పేట (40.2 డిగ్రీల సెల్సియస్)

Latest Videos

వడగాల్పులు హైదరాబాద్ కే పరిమితం కాలేదు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వేసవి తాపం తీవ్రంగా ఉంది. శుక్రవారం నల్లగొండ జిల్లా దామరచర్ల, కరీంనగర్ వీణవంకలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 22, 2023 వరకు హైదరాబాద్ నగరంలో 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని టీఎస్ డీపీఎస్ అంచనా వేసింది. ఇదే సమయంలో తెలంగాణలోని ఇతర జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇదిలావుండగా, తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప‌లు జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో వడదెబ్బతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టిగల్లుకు చెందిన పదేళ్ల బాలుడు గురువారం రాత్రి మృతి చెందాడు. గురువారం హైదరాబాద్ వచ్చిన బాలుడు నగరమంతా తిరిగాడు. ఆ తర్వాత ఎండ వేడిమికి వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. గురువారం రాత్రి మృతి చెందాడు. అలాగే, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఆమె వడదెబ్బకు గురై కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.

click me!