పులివెందులలోనే గడీల పాలన: వైఎస్ షర్మిలకు గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్

Published : Apr 10, 2021, 10:33 AM IST
పులివెందులలోనే గడీల పాలన: వైఎస్ షర్మిలకు గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్

సారాంశం

ఖమ్మం సంకల్ప యాత్ర సభలో వైఎస్ షర్మిల చేసిన విమర్శలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గడీల పాలన తెలంగాణలో కాదు, పులివెందులలోనే ఉందని ఆయన అన్నారు.

హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గడీల పాలన తెలంగాణలో లేదని, పులివెందులలో ఉందని ఆయన అన్నారు. ఖమ్మం సంకల్ప యాత్ర సభలో శుక్రవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తీవ్రైన విమర్శలు చేశారు. ఆమె 40 నిమిషాల పాటు మాట్లాడితే 38 నిమిషాలు కేసీఆర్ ను విమర్శించడానికే వినియోగించారు. 

ఆంధ్రపాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ఇంకా దుర్బుధితో కొత్త పార్టీలు వస్తున్నాయని ఆయన షర్మిల పార్టీ ఏర్పాటు నిర్ణయంపై వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించడానికి, అలజడి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అలాంటి కుట్రలను ప్రజలు తిప్పికొడుతారని ఆయన అన్నారు 

కులాల మధ్య చిచ్చు పెట్టేవారికి ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేస్తుందని ఆయన అన్నారు. సుస్థిర ప్రబుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు సాగుతున్నాయని ఆయన అన్నారు. పొతిరెడ్డిపాడు, సంగమేశ్వర్ ప్రాజెక్టు ద్వారా నీటి దోపిడీని చేస్తున్నది ఎవరని ఆయన అడిగారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu