తెలంగాణలో 3వేలకు దగ్గర్లో కరోనా కేసులు

By AN TeluguFirst Published Apr 10, 2021, 10:13 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,11,726 మందికి కరోనా నిర్థారణ పరీక్సలు నిర్వహించగా... కొత్తగా 2,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,11,726 మందికి కరోనా నిర్థారణ పరీక్సలు నిర్వహించగా... కొత్తగా 2,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. 

రాష్్రంలో నిన్న కరోనాతో ఆరుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,752కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 584 మంది కోలుకున్నారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,04,548కి చేరింది. 17,791 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 11,495మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 487 కేసులు నమోదయ్యాయి. 

ఇదిలా ఉండగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం డీజీపీ మహేందర్ రెడ్డి కోవిడ్ వ్యాప్తి నివారణపై రాష్ట్రంలోని అన్నిపోలీస్ కమీషనర్లు, ఎస్పిలు, పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైసేషన్ తదితర కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని డీజీపీ ఆదేశించారు. కోవిడ్ రెండవ విడత రాష్ట్రంలో తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నందున దీని నివారణకు మరోసారి పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 

స్థానిక స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సహాయ సహాకారాలతో కోవిడ్ నివారణ చర్యలు, వాక్సినేషన్ వేసుకోవడం, మాస్క్ లను ధరించడం తదితర నివారణ చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని డిజిపి ఆదేశించారు.

click me!