విచిత్రం : పొట్టేళ్ల కాపర్లుగా మారిన బంజారాహిల్స్ పోలీసులు.. !

By AN TeluguFirst Published Apr 10, 2021, 9:37 AM IST
Highlights

పొట్టేళ్ల మధ్య పోటీలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాయి. అష్టకష్టాలకు గురి చేశాయి. ఇంతకీ పోలీసులకు ఈ పొట్టేళ్లతో ఏం పని అంటారా?...

పొట్టేళ్ల మధ్య పోటీలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాయి. అష్టకష్టాలకు గురి చేశాయి. ఇంతకీ పోలీసులకు ఈ పొట్టేళ్లతో ఏం పని అంటారా?...

ఆ పొట్టేళ్ల ఒక్కోదాని బరువు 60 కేజీలకు పైగానే ఉంటుంది. అవి ఒక్కసారి కుమ్మాయంటే.. ఆరడుగుల మనిషైనా అవలీలగా ఎగిరి అవతల పడతాడు. అంత బలిష్టమైనవి. ఇలాంటి రెండు పొట్టేళ్ల మధ్య అక్రమంగా పోటీలు పెట్టారు కొంతమంది.  

బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హకీంపేట్‌లో శుక్రవారం అక్రమంగా పోటీలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 15 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిదగ్గరున్న రెండు పొట్టేళ్లను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.

ఇప్పుడు మొదలైంది అసలు కథ.. ఈ పొట్టేళ్లను అదుపుచేయడం పోలీసులకు తలనొప్పిగా మరింది. వాటిని స్టేషన్లో పెట్టలేరు. బండికి కట్టేయలేరు. వాటి బలం ముందు బండ్లు ఆగవు. తెంచుకుని పారిపోతాయి. ఏం చేయాలో, ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు. 

మొత్తానికి అష్టకష్టాలు పడి ఎలాగోలా వీటిని స్టేషన్‌ వెనుక ఉన్న సిమెంటు బల్లలకు కట్టేశారు. అక్కడ్నుంచి కూడా పారిపోతే.. లేదా ఎవరైనా ఎత్తుకుపోతే.. అందుకే ఒక్కో పొట్టేలు దగ్గర ఒక్కో కానిస్టేబుల్ ను కాపలా పెట్టారు. 

ఎంతకాలం ఇలా అంటారా?? వాటిని వెటర్నరీ హాస్పిటల్‌లో అప్పగించేంత వరకు.. పాపం పోలీసులకు ఈ ఎక్స్ ట్రా డ్యూటీ తప్పదు. ఈ పొట్టేళ్లకు పేర్లు కూడా ఉన్నాయండోయ్.. ఒకదాని పేరు వీర్‌.. మరోదాని పేరు మాలిక్‌.. బాగున్నాయి కదా.. 

click me!