నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట: గుత్తా సుమన్‌కుమార్‌ను కస్టడీలోకి తీసుకొన్న నార్సింగి పోలీసులు

By narsimha lodeFirst Published Nov 3, 2021, 2:16 PM IST
Highlights

రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మంచిరేవులలోని సినీ నటుడు నాగశౌర్యకు చెందిన ఫామ్‌హౌస్‌లో  పేకాట నిర్వాహకుడు గుత్తా సుమన్‌కుమార్ ను పోలీసులు ఇవాళ తమ కస్టడీలోకి తీసుకొన్నారు.

హైదరాబాద్:  రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని  మంచిరేవులలోని సినీ నటుడు naga shourya  ఫామ్‌హౌస్‌లో పేకాట కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ కుమార్ ను నార్సింగి పోలీసులు కస్టడీకి తీసుకొన్నారు. రెండు రోజుల పాటు గుత్తా సుమన్ కుమార్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు.

also read:నాగశౌర్య ఫాంహౌజ్ కేసు : చుట్టూ బాడీగార్డులు.. టేబుల్ కు 5 లక్షలు, ప్రముఖులతో వాట్సాప్ గ్రూపులు...

 గత నెల 31వ తేదీన హైద్రాబాద్ నగర శివారులోని మంచిరేవులలోని హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో Playing Cards ఆడుతున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు Gutha Suman kumar ను పోలీసులు కస్టడీకి తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కుమార్ ను police Custody కోర్టు అనుమతించింది. దీంతో ఇవాళ చర్లపల్లి జైలు నుండి పవన్ కుమార్ ను పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

గుత్తా పవన్ కుమార్ హైద్రాబాద్ నగరంలోని స్టార్ హోటళ్లలో పేకాట ఆడిస్తున్నారని పోలీసులు గుర్తించారు. రిమాండ్ రిపోర్టులో పోలీసుల కీలక విషయాలను ప్రస్తావించారు. పేకాట ఆడేవారి కోసం సుమన్ కుమార్ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశాడు. ఈ గ్రూపుల్లో చాటింగ్ చేసేవాడు. ఎక్కడ పేకాట ఆడిస్తున్నారనే విషయమై ఈ గ్రూపుల ద్వారా సమాచారం ఇచ్చేవాడు. అంతేకాదు డిజిటల్ రూపంలోనే నగదును తీసుకొని పేకాట ఆడేవారికి కాయిన్స్ ను సుమన్ కుమార్ అందించేవాడు. పేకాట ఆడేందుకు రావాలని సుమన్ కుమార్ ఆహ్వానించేవాడు. ఈ మేరకు ఆహ్వాన పత్రికలను కూడా ఆయన పంపినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ ఫామ్ హౌస్ ను హీరో నాగశౌర్య  లీజుకు తీసుకొన్నాడు. ఈ విషయమై రెంటల్ అగ్రిమెంట్ ను తీసుకురావాలని హీరో నాగశౌర్య తండ్రి రవీంద్రకు నార్సింగి పోలీసులు సూచించారు. సుమన్ కుమార్   మాత్రం బర్త్‌డే  పార్టీ కోసం  ఈ ఫామ్ హౌస్‌ను లీజుకు తీసుకొన్నాడు. గతంలో కూడా మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని స్టార్ హోటల్స్ ను కూడా పవన్ కుమార్  లీజుకు తీసుకొని పేకాట ఆడించినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. సుమన్ కుమార్ కు ఎవరెవరు సహకరించారనే విషయమై పోలీసులు  లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

ప్రముఖులను గోవాతో పాటు ఇతర ప్రాంతాలకు టూర్లకు తీసుకెళ్లేవాడని పోలీసులు గుర్తించారు. మరో వైపు సుమన్ కుమార్ పై ఉన్న కేసుల గురించి కూడా తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులను సంప్రదించారు.  ఏపీ పోలీసులు నార్సింగి పోలీసులకు  కీలక సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పేకాట ఆడుతున్న 30 మందిని ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. అయితే తొలుత కోర్టు వారిని రిమాండ్ తరలించాలని ఆదేశించింది. మరోవైపు నిందితులకు మరునాడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.రెండు రోజుల పాటు    సుమన్ కుమార్ నుండి కీలక విషయాలను రాబట్టాలని  నార్సింగి పోలీసులు భావిస్తున్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొన్నారు.

click me!