అండ‌గా ఉంటాం.. సిరిసిల్ల జిల్లాలో అత్యాచారానికి గురైన చిన్నారికి మంత్రి కేటీఆర్ ప‌రామ‌ర్శ

By team teluguFirst Published Nov 3, 2021, 1:45 PM IST
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో ఆరేళ్ల బాలిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరం అని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో ఆరేళ్ల బాలిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరం అని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితుడు ఎవరైనా కఠిన శిక్ష పడాల్సిందేనని అన్నారు. బాధిత చిన్నారికి మెరుగై వైద్యం అందించాలని డాక్టర్స్‌కు కేటీఆర్ సూచించారు.  బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే ఇలాంటి ఘటన జరగడంతో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. 

Also read: హుజురాబాద్ ఫలితంపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్.. ఆయన ఎమన్నారంటే..

Sircilla జిల్లా  కోనరావుపేట మండలానికి చెందిన గిరిజన దంపతులు ఆరేళ్ల పాపతో కలిసి ఉద్యోగరీత్యా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామంలో శంకర్ అనే వ్యక్తి ​ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. శంకర్ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు, అతడి భార్య ఊరి సర్పంచ్. అయితే పాప ఇంట్లో టీవీ లేకపోవడంతో శంకర్ ఇంటికి వెళ్లి టీవీ చూసేది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకున్న శంకర్.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి చేరిన తల్లిదండ్రులు, చిన్నారి అస్వస్థతకు గురికావడాన్ని గుర్తించారు. బాలిక తల్లిదండ్రులకు జరిగింది చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

దీంతో వారు శంకర్‌ను ప్రశ్నించగా.. అతడు తిరిగి బాలిక తల్లిదండ్రులపై బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలోనే బాలిక తల్లిదండ్రులు ఎల్లారెడ్డి పేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని రిమాండ్​కు తరలించారు. నిందితుడిపై  పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ చంద్రశేఖర్‌ వివరించారు. 

Also read: ఐదేళ్ల చిన్నారిపై పద్నాలుగేళ్ల బాలుడు లైంగి దాడి...

అయితే ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయింది. చిన్నారికి న్యాయం చేయాలంటూ ఎల్లారెడ్డిపేటలో గిరిజన నాయకులు, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల లీడర్లు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలియజేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

click me!