
తెలంగాణ నిరుద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైంది. జూలై 21వ తేదీ నుండి జరగాల్సిన గురుకుల పరీక్షలు చివరి నిమిషంలో తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 18 నుండి పిజీటి పరీక్షలు జరిగాయి. నేటి నుండి 20 టీజిటి పరీక్షలు మొదలయ్యాయి. కానీ జూలై 21 నుండి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు. చివరి నిమిషంలో హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం వెనకడుగు వేసింది.
గురుకుల టిజిటి, పిజిటి పోస్టుల విషయంలో లింగ వివక్ష కొనసాగుతోందని, నిరుద్యోగులు న్యాయ పోరాటం కూడా చేశారు. మహిళకు అధిక శాతం ప్రాధాన్యత ఇస్తున్నారని, కొంత మంది నిరుద్యోగులు డిమాండ్ చేశారు. దీనిపైన హైకోర్టు కూడా వెళ్లారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు నిర్వహించిన టీెెఎస్పిఎసీ, శుక్రవారం నుండి జరిగే పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు వాయిదా వేసింది. ఈ నెల 22,23,24,25,26,27,28,29 తేదీలలో జరగాల్సిన గురుకుల పరీక్షలు వాయిదా పడ్డాయి. తిరిగి గురుకుల పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం ప్రకటించలేదు.