
కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తెలంగాణ అంతా డ్రగ్స్ ఊబీలో నిండిపోయిందని, అందులో టీఆర్ఎస్ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఘాటుగానే వాక్యానించారు. తెలంగాణలో జరుగుతన్న డ్రగ్ వ్యవహారంలో భాగంగా ఆయన ఈ వాక్యలు చేశారు. అయితే దిగ్విజయ్ సింగ్ మాటలకు తెలంగాణ ఐటీ మినిష్టర్ కౌంటర్ ఇచ్చారు. దిగ్విజయ్ కు వయస్సు అయిపొందని, ఇక మీరు రాజకీయాలకు పనికి రారు, రిటైరై అవ్వమని, వయస్సుకు తగ్గ పనులు చెయ్యాలని దిగ్విజయ్ కు కేటీఆర్ చురకలంటించారు.
అదే నేపథ్యంలో దిగ్విజయ్ పై కామెంట్ చేసిన కేటిఆర్‌కు మద్దతు పలికింది సినీ నటి మంచు లక్ష్మీ. ట్వీట్టర్ వేదికగా స్పందించింది. అవును రామ్(కేటీఆర్ ను ఉద్దేశిస్తు) ఆయనకు ఎప్పుడో మతి పోయిందని ట్వీట్ చేసింది.
మరీ కేటీఆర్, మంచు లక్ష్మీ ఇచ్చిన కౌంటర్‌కి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.