
హైదరాబాద్ లో ఇక అక్రమ కట్టడాలకు చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కదిలింది. అక్రమ కట్టడాల నివారణకు జీహెచ్ఎంసీ తన ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలోను హైదరాబద్ లో అక్రమ భవనాలను కూల్చివేసిన గ్రేటర్ హైదరాబాద్ ముప్సిపల్ కార్పోరేషన్ మరోసారీ కూల్చివేతలకు కట్టుదిట్టమైన ప్లాన్‌తో బరిలోకి దిగనుంది.
ఇక మీదట హైదరాబాద్‌లో ఇల్లు కట్టలంటే ఇకపై జీహెచ్ఎంసీ అధీకారులు ఒక్క సారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా 6 సార్లు తనిఖీలు నిర్వహిస్తారు. ఒక సారి వచ్చిన అధికారులు మరో సారి రాకుండా కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలను నిర్మిస్తే పూనాదులతో నిర్మాణం క్లోజ్ చేస్తారట. నిర్మాణంలో ఎలాంటి లోపాలు ఉన్న అనుకున్న ప్లాన్ ప్రకారం నిర్మించకపోయిన జీహెచ్ఎంసీ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది
అంతేకాదు జీఎచ్ఎంసీ అధికారులకు ఇచ్చిన ప్లాన్ల్‌కు బహుళ అంతస్థుల బిల్డర్లు ఏమాత్రం మార్పులు చేర్పులు చేసిన నిర్మాణ దశలోనే కట్టడాలను నిలిపివేస్తారు. ఆ బిల్డర్ పైన లేదా ఆ ఇంటి యజమాని పైన తగిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారి దేవేంధర్ తెలిపారు.