నల్గొండలోని డేరా బాబా ఆస్తుల స్వాధీనం (వీడియో)

First Published Aug 27, 2017, 4:09 PM IST
Highlights
  • నల్లగొండలోని డేరా బాబా ఆస్తులు స్వాధీనం
  • అసైన్డ్ భూములను స్వాధీనపరచుకున్న సర్కారు
  • 18 ఎకరాలు ఆక్రమించినట్లు ఆరోపణలు
  • ప్రస్తుతం 9 ఎకరాల స్వాధీనం

ఊరు కాని ఊరులో చొరబడి అక్రమంగా ఆస్తులు సంపాదించిన డేరా బాబా అలియాస్ గుర్మిత్ సింగ్ కు నల్లగొండ అధికారులు చెక్ పెట్టారు. నల్లగొండ జిల్లాలో డేరా బాబా ఆశ్రమానికి ఉన్న భూముల్లో తొమ్మిది ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అక్రమ అసైన్డ్ ల్యాండ్ అని నిర్ధారణ కావడంతో ఆ 9 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు తహసీల్దార్ ప్రకటించారు. అయితే ప్రొసీజర్ ప్రకారం భూముల స్వాధీనం చేపడతామని నల్లగొండ ఆర్డీఓ వెల్లడించారు.  

భూముల చుట్టూ 10 అడుగుల గోడ కట్టడంవల్ల చుట్టుపక్కల పొలాలు ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వారు అధికారులకు పిర్యాదు చేశారు. పంజాబ్‌, హరియానాలో ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ బాబా ఆస్తులు రాష్ట్రంలోనూ వెలుగు చూశాయి. 55 ఎకరాలు డేరా సచ్చా సౌధ పేరిట రిజిస్టరై ఉంది. అందులో 18 ఎకరాల దాకా అసైన్డ్‌ భూమి ఉంది. దీనిపై ఆశ్రమ నిర్వాహకులకు రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో 65వ నంబర్‌ జాతీయరహదారివెంబడి సుమారు 55 ఎకరాల భూమిని డేరా సచ్చా సౌధ పేరిట కొనుగోలు చేశారు. 2008 నుంచి 2015 వరకు పలు దఫాలుగా కొనుగోలు చేసిన ఈ భూమి.. ట్రస్టు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ పురుషోత్తంలాల్‌, కిషన్‌ సేవాధారతో పాటు మరికొందరి పేరు మీద రిజిస్టరై ఉంది. ఈ భూమి విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

కాగా, ఈ 55 ఎకరాల్లో 18 ఎకరాల అసైన్డ్‌ కూడా ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఆశ్రమ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. అంతేగాక ప్రహరీ కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వ నీరు పోకుండా అడ్డంగా ప్రహరీ నిర్మించడంతో పంట పొలాలు మునిగిపోతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. నిర్వాహకులు మాత్రం సేవా కార్యక్రమాల కోసమే ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నా.. పంచాయతీకి బోరును అద్దెకు ఇచ్చి నెలకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. అయితే, భూమిని కొనుగోలు చేసే దగ్గర్నుంచి ఇప్పటిదాకా బాబా ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు.

click me!