ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో విద్యార్థి అనుమానాస్పద మృతి

First Published Aug 27, 2017, 3:30 PM IST
Highlights
  • నాదర్ గూల్ డిల్లీ పబ్లిక్ స్కూల్ లో విద్యార్థి మృతి
  • అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
  • బాలుడి నేత్రాలు దానం చేసిన తల్లిదండ్రులు

రంగారెడ్డి జిల్లా అధిబట్ల పీస్ పరిధిలోని నాదర్ గూల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 6 తరగతి చదువుతున్న ఆదర్శ్(11)శనివారం అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. శనివారం నాడు నాచారం DPS స్కూల్ కి వెళ్లి ఆట పోటీలు నిర్వహన అనంతరం సాయంత్రం నాదర్గుల్  స్కూల్ కి వచ్చాడు.

తరువాత మూడవ అంతస్థులో  బ్యాగ్ నీ మర్చిపోయానని చెప్పి ఆదర్శ్ స్కూల్ బిల్డింగ్ పైకి వెళ్లాడు. బ్యాగ్ కోసం. కానీ ఆదర్శ్ చాలా సేపటి వరకూ కిందకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన పాఠశాల యాజమాన్యం బిల్డింగ్ పైకి వెళ్లి చూడగా ఆదర్శ్ స్పృహ కోల్పోయి పడివున్నాడు. బాలుడి ని నగరంలో  కామినేని హాస్పిటల్ తరలించే సమయంలో మరణించాడు.

ఆదర్శ్ తల్లిదండ్రులు పెద్ద మనస్సులో నేత్రదానం చేశారు. ఆదర్శ్ గ్రామం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలన్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆరోగ్యం తో వెళ్లిన బాలుడు శవంగా తిరిగి రావటంతో స్కూల్ యాజమాన్యం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బంధువులు, గ్రామస్తులు. లక్షలు లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్ లకు పంపిస్తే విద్యార్థుల  భవిష్యత్తు కు జీవితాలకు భద్రత లేకుండా పోతుందని స్కూల్ యాజమాన్యం పై ఆగ్రహం

click me!