టీఎస్‌పీఎస్సీ : గ్రూప్ 2 పరీక్షలు వాయిదా .. కొత్త డేట్స్ ఇవే

Siva Kodati |  
Published : Oct 10, 2023, 09:25 PM ISTUpdated : Oct 10, 2023, 09:34 PM IST
టీఎస్‌పీఎస్సీ : గ్రూప్ 2 పరీక్షలు వాయిదా .. కొత్త డేట్స్ ఇవే

సారాంశం

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. నవంబర్ 2, 3 బదులుగా జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమీషన్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావపేశంలో పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు. 

ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 29, 30 తేదీల్లో పరీక్ష జరగాల్సి వుంది. అయితే ఆ సమయంలో వరుసగా ఇతర పోటీ పరీక్షలు వుండటంతో అభ్యర్ధులు ఆందోళన నిర్వహించారు. దీంతో దిగొచ్చిన టీఎస్‌పీఎస్సీ.. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసింది. అనంతరం నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు గాను తెలంగాణ వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?