పెళ్లి చేసుకున్న రోజే వధువుకు కడుపు నొప్పి.. మరుసటి రోజే ప్రసవం.. షాక్‌లో వరుడు.. ఎలా కవర్ చేశారంటే?

By Mahesh KFirst Published Jun 29, 2023, 7:22 PM IST
Highlights

హైదరాబాద్‌కు చెందిన మహిళ నోయిడాలోని వ్యక్తితో పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న రోజు రాత్రే ఆమెకు కడుపులో నొప్పి వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లగా ఆమె గర్భవతి అని తెలిసింది. అంతేకాదు, మరుసటి రోజే ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. ఇది తెలుసుకుని వరుడు షాక్‌లోకి వెళ్లిపోయాడు.
 

నోయిడా: ఆ వరుడు జీవితాంతం కోలుకులేని ఘటన ఎదుర్కొన్నాడు. పెళ్లి గురించి ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. కానీ, పెళ్లి చేసుకున్న రోజే అతను హతాశయుడయ్యాడు. తాను పెళ్లి చేసుకున్నది ఒక గర్భిణిని అని తెలిసి తేరుకోలేకపోయాడు. పెళ్లి రోజే ఆమెకు కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్ తరలించారు. ఆమె ఏడు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. మరుసటి రోజే ఆ వధువు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ యువతి హైదరాబాద్‌కు చెందినామె కావడం గమనార్హం. ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

సికింద్రాబాద్‌కు చెందిన మహిళకు గ్రేటర్ నోయిడాలోని ఓ వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. ఈ నెల 26వ తేదీన వీరి వివాహం జరిగింది. పెళ్లి జరిగిన రోజు రాత్రి ఆమెకు కడుపులో నొప్పి వచ్చింది. వెంటనే ఆమెను హాస్పిటల్ తరలించారు. అక్కడ వైద్యులు చెప్పిన విషయాలు విని వరుడికి తలతిరిగినంత పనైంది. ఆమె ఏడు నెలల గర్భిణి అని వైద్యులు చెప్పారు. మరుసటి రోజు ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

పెళ్లికి ముందే వధువు పొట్ట పెద్దగా ఉండటంపై వరుడికి, వరుడి కుటుంబానికి అనుమానాలు వచ్చాయి. అయితే.. అందుకు వధువు కుటుంబ వివరణ ఇచ్చింది. ఆమె ఇటీవలే రాళ్లు తొలగించుకోవడానికి ఆపరేషన్ చేసుకుందని తెలిపారు. అందుకే కడుపు కాస్త వాపుగా కనిపిస్తున్నదని వివరించారు. ఈ వివరణ వరుడి కుటుంబం కన్విన్స్ అయింది. వధువు కుటుంబనికి ఆమె గర్భిణి అని తెలుసు. కానీ, ఆ విషయాన్ని వరుడి కుటుంబానికి చెప్పలేదు.

Also Read: అంత్యక్రియల్లో హాజరుకాలేదని పొరుగింటివారిపై కత్తితో దాడి.. మహిళ మృతి

అయితే, పెళ్లి రోజే వారికి మైండ్ బ్లాక్ అయింది. వధువు గర్భం గురించి ఆమె తల్లిదండ్రులను నిలదీశారు. చిన్నపాటి వాగ్వాదం తర్వాత ఇరు కుటుంబాలు రాజీకి వచ్చాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పెల్లి కూతురు బంధువులకు సమాచారం చేరవేయగా.. హైదరాబాద్ నుంచి వారు నోయిడాకు వెళ్లారు. 

భర్త, అత్తమామలు ఆమెను అంగీకరించలేదు. దీంతో వధువును, వధువు కుమార్తెను ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.

click me!