
అంత్యక్రియలకు డబ్బులు లేక తాత మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచాడో మనవడు. వరంగల్ జిల్లా పరకాలలో ఈ ఘటన జరిగింది. బాలయ్య అనే వ్యక్తి తన మనవడితో కలిసి గత ఐదేళ్లుగా వరంగల్ పట్టణంలో నివసిస్తున్నారు. అయితే వయోభారంతో బాలయ్య మరణించాడు. దీంతో అంత్యక్రియలు చేయడానికి మనవడికి ఎలాంటి అవగాహన లేకపోవడంతో పాటు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా తాత శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టాడు. అయితే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఫ్రిజ్‌లో వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే యువకుడి మానసిక స్థితి సరిగా లేదని సమాచారం.